E-Paper
Advertisement

Thriller movie OTT : కారులో శవాన్ని తీసుకొచ్చే కూతురు.. దాన్ని మాయం చేసే అమ్మ, మైండ్ బ్లాక్ చేసే మూవీ ఇది

Thriller movie OTT : కారులో శవాన్ని తీసుకొచ్చే కూతురు.. దాన్ని మాయం చేసే అమ్మ, మైండ్ బ్లాక్ చేసే మూవీ ఇది
Advertisement

Thriller movie OTT : థ్రిల్లర్ సినిమాలు ఆడియన్స్ కు టెన్షన్ పెంచుతూ ఉంటాయి. ఇక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేము. క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి ఈ జానర్ సినిమాలు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటి తరహాలోనే ఉంటుంది. ఒక తల్లి తన కూతురిని కాపాడుకోవడానికి ఎంతటి రిస్క్ తీసుకుంటుంది అనే పాయింట్ చుట్టూ తిరిగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. మరి ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో చూడచ్చు అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఎకో వ్యాలీ’ (Echo Valley). ఇది 2025 జూన్ 6న థియేటర్లలో, ఆపై జూన్ 13న Apple TV+ ఓటీటీలో విడుదలైంది. మైఖేల్ పియర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూలియన్ మూర్, సిడ్నీ స్వీనీ, డోమ్‌నాల్ గ్లీసన్, కైల్ మక్‌లాచ్‌లాన్, ఫియోనా షా నటించారు. హిట్ వెబ్ సిరీస్ ‘మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్’ రచయిత అయిన బ్రాడ్ ఇంగెల్స్‌బీ ఈ సినిమాకి కథ అందించారు.

కథలోకి వెళ్తే

Advertisement

కేట్ పెన్సిల్వేనియాలోని ఒక పెద్ద ఫామ్‌హౌస్‌లో గుర్రాలకు ట్రైనింగ్ ఇస్తూ ప్రశాంతంగా బతుకుతుంటుంది. తన కొడుకు చనిపోవడంతో ఆ బాధలో అందరికీ దూరంగా ఉంటుంది. తన కూతురు క్లెయిర్ తో కూడా ఆమెకు సరిగ్గా మాటలు ఉండవు. అయితే ఒకరోజు అర్ధరాత్రి క్లెయిర్ భయంతో వణుకుతూ, ఒళ్లంతా రక్తంతో కేట్ దగ్గరకు వస్తుంది. క్లెయిర్ తన ప్రియుడిని చంపేసిందని కేట్‌కు అర్థమవుతుంది. పోలీసులు వస్తే తన కూతురు జీవితం నాశనమవుతుందని భయపడి, కేట్ ఆ నిజాన్ని దాచిపెట్టి, ఆధారాలను చెరిపేయాలని అనుకుంటుంది.

ఇక కేట్ తన కూతురిని కాపాడే ప్రయత్నంలో ఉండగా కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. జాకీ అనే ఒక లోకల్ డ్రగ్ డీలర్ సీన్లోకి వస్తాడు. దీంతో కథ మరింత ఇంటెన్స్ గా సాగుతుంది. ఈ హత్య వెనుక అసలు కారణం ఏంటి? జాకీకి దీనికి ఉన్న సంబంధం ఏంటి? అనేది కథలో అసలైన ట్విస్ట్. ఒక పక్క పోలీసులు, మరోపక్క ప్రమాదకరమైన నేరస్థుల మధ్య కేట్ తన కూతురిని ఎలా బయటపడేసింది అనేదే మిగిలిన కథ.

Advertisement

Read Also : 70 ఏళ్ల వయసులో విడాకుల కోసం… పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా రొమాంటిక్ కామెడీ ఓటీటీలోకి… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే?

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×