E-Paper
Advertisement

The Paradise: నాని ప్యారడైజ్ కోసం రెండున్నర ఎకరాలు, 100 ట్యాంకులు.. ఇంకా ఏమేమి చేశారో తెలుసా?

The Paradise: నాని ప్యారడైజ్ కోసం రెండున్నర ఎకరాలు, 100 ట్యాంకులు.. ఇంకా ఏమేమి చేశారో తెలుసా?
Advertisement

The Paradise: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నాని (Nani) ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తన నటనను మెరుగుపరుచుకుంటూ.. ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు నేచురల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు సినిమాలు నిర్మిస్తూ బిజీగా మారిపోయారు. ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odala) దర్శకత్వంలో యాక్షన్ డ్రామా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మొదట చిత్ర బృందం ప్రకటించినప్పటికీ.. ఆగస్టు 21కి వాయిదా వేశారు. భారతీయ సినిమాలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది.

ది ప్యారడైజ్ కోసం నాని కష్టం..

ఇదివరకే శ్రీకాంత్ ఓదెల , నాని కాంబినేషన్లో ‘దసరా’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మళ్లీ వీరి కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ అంతకుమించి ఉంటుందని శ్రీకాంత్ హామీ ఇచ్చారు.. రెండు జడలతో కూడిన నాని లుక్ తో పాటు ఇందులో సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే మోహన్ బాబు విలన్ పాత్ర పోషిస్తున్నట్లు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమా నుండి ఇటీవల వచ్చిన “ఆయా షేర్” సాంగ్ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

ALSO READ:Devara 2 Shooting Update: దేవర 2 షూటింగ్ షురూ.. కిక్ ఇచ్చే మరో న్యూస్!

రెండున్నర ఎకరం మురికివాడ.. 100 ట్యాంకర్ల నీళ్లు…

అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర బృందం పడ్డ కష్టం గురించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాను చాలా సహజత్వంగా రూపొందించడానికి చిత్ర బృందం పడ్డ కష్టం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సహజంగా తీర్చిదిద్దడానికి శ్రీకాంత్ ఓదెల ఏకంగా రెండున్నర ఎకరం భూమిలో 60 నిజమైన ఇళ్లతో ఒక మురికివాడ సెట్ ను నిర్మించారు. అందులో నాని పాత్ర కోసం ఒక భారీ ఇల్లు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఈ సెట్ లో ఒకేసారి 500 మందిని కూర్చోబెట్టవచ్చట. అంతేకాదు ఒక పాట కోసం ఏకంగా 100 ట్యాంకర్ల నీటిని ఉపయోగించి.. ఒక నీటి కుంటను కూడా సృష్టించారు . ఇది నిండిపోవడానికి సుమారుగా ఏడు రోజుల సమయం పట్టిందని సమాచారం. ఏది ఏమైనా ది ప్యారడైజ్ సినిమాలో సహజత్వాన్ని ఉట్టిపడేలా చేయడానికి ఈ రేంజ్ లో కష్టపడినట్లు సమాచారం.. ఏది ఏమైనా ది ప్యారడైజ్ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×