E-Paper
Advertisement

The Raja Saab: నార్త్ అమెరికాలో ది రాజా సాబ్ పరిస్థితి మరీ దారుణం.. ఎంత కలెక్ట్ చేసిందంటే..!

The Raja Saab: నార్త్ అమెరికాలో ది రాజా సాబ్ పరిస్థితి మరీ దారుణం.. ఎంత కలెక్ట్ చేసిందంటే..!
Advertisement

The Raja Saab: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాజా సాబ్ సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాలు, భారీ ప్రచారం మధ్య విడుదలైన ఈ సినిమా అక్కడ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. చివరికి నార్త్ అమెరికాలో ఈ సినిమా తన ప్రదర్శనను కేవలం 2.35 మిలియన్ డాలర్ల వద్ద ముగించింది.
భారతీయ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన అతిపెద్ద హారర్ ఫాంటసీ సినిమా అని ప్రచారం చేసిన రాజా సాబ్ కు ఈ ఫలితం తీవ్ర షాక్‌లా మారింది. ముఖ్యంగా భాషల వారీగా చూస్తే పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తుంది. హిందీ వెర్షన్ కేవలం 58 వేల డాలర్లు మాత్రమే వసూలు చేయగా, తమిళ వెర్షన్ అయితే 3 వేల డాలర్లు కూడా దాటలేకపోయింది. అమెరికాలో మొత్తం 2.16 మిలియన్ డాలర్లు..కెనడాలో 1.79 లక్షల డాలర్లు మాత్రమే రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నటించిన సినిమాకు ఇది నిజంగా అవమానకరమైన ఫలితం అని విశ్లేషకులు అంటున్నారు. విడుదలైన మొదటి రోజే సినిమా ఓపెనింగ్స్ బలహీనంగా ఉండటం, ప్రేక్షకుల నుంచి నెగటివ్ టాక్ రావడం సినిమా భవితవ్యాన్ని ముందే చెప్పేశాయి. మౌత్ టాక్ పూర్తిగా వ్యతిరేకంగా మారడంతో రెండో రోజు నుంచే కలెక్షన్లు భారీగా పడిపోయాయి. రెండో వీకెండ్‌కు వచ్చేసరికి థియేటర్లలో ప్రేక్షకులే లేకుండా పోయారు.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘రాజా సాబ్’ మొత్తం కలెక్షన్లు సుమారు 185 నుంచి 190 కోట్ల రూపాయల మధ్యే ఆగే అవకాశం ఉంది. సంక్రాంతి లాంటి పెద్ద పండుగ సీజన్‌లో విడుదలైన ప్రభాస్ సినిమాకు ఇది చాలా తక్కువ అంకె. సినిమా స్కేల్, జానర్‌పై క్రియేట్ చేసిన హైప్‌కు ఈ ఫలితం పూర్తిగా విరుద్ధంగా ఉంది.

ట్రేడ్ పరంగా చూస్తే, గత ఏడాది రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’కు ఎదురైన పరిస్థితితో ‘రాజా సాబ్’ పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. బలహీనమైన ఓపెనింగ్, చెడు టాక్, భారీ డ్రాప్స్… చివరికి నిరాశకరమైన లైఫ్‌టైమ్ కలెక్షన్లు. ఈ నేపథ్యంలో ‘రాజా సాబ్’ ప్రభాస్ కెరీర్‌లో ‘రాధే శ్యామ్’ స్థాయిలో ఒక పెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్‌గా గుర్తుండిపోతుంది.

Advertisement

ALSO READ: Kiara Advani: బీఫ్, పోర్న్ నిషేధంపై కియారా అద్వానీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్యానికి అర్థం లేదు అంటూ..!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×