Skoda Kushaq vs Hyundai Creta Comparison: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో హ్యుందాయ్ క్రెటా మిడ్ సైజ్ SUV విభాగంలో టాప్ మోడల్ గా కొనసాగుతోంది. అదిరిపోయే అమ్మకాలతో సత్తా చాటుతోంది. ఈ కారుకు 2026 స్కోడా కుషాక్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. మిడ్ లైఫ్ సైకిల్ ఫేస్ లిఫ్ట్ గా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న ఈ కారు క్రెటా ఆధిపత్యాన్ని సవాల్ చేయబోతోంది. 2026 స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్, హ్యుందాయ్ క్రెటా మధ్య పోటీ గట్టిగా ఉండబోతోంది. క్రెటా సైజ్, అధునాతన ఫీచర్లతో ముందంజలో ఉండగా, కుషాక్ యూరోపియన్ డ్రైవింగ్ అనుభూతి, భద్రత, శక్తివంతమైన టర్బో ఇంజిన్‌లతో ఆకట్టుకోబోతోంది. అయితే, ఈ రెండు కార్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లను సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
స్కోడా కుషాక్ 1.0L, 1.5L TSI టర్బో పెట్రోల్ ఇంజిన్లతో రానుంది. ఇది 150 PS వరకు పవర్ ను అందిస్తుంది. హ్యుందాయ్ క్రెటా 1.5L NA పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఆప్షన్లుతో అందుబాటులో ఉంది. 1.5L టర్బో 160 PS శక్తిని ఇస్తుంది. క్రెటా NA పెట్రోల్ కంటే కుషాక్ 1.0 పవర్ ఫుల్ గా ఉండోతోంది. అయితే కుషాక్ 1.5 కంటే క్రెటా టర్బో మరింత పవర్ ఫుల్. ఈ SUVలు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ ను కలిగి ఉన్నప్పటికీ, కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ యూనిట్లతో వస్తుంది. క్రెటా నేచురల్ ఆస్పిరేటెడ్, టర్బోచార్జ్డ్ యూనిట్‌ను పొందుతుంది. కుషాక్ 1.0ను నేచురల్ ఆస్పిరేటెడ్ క్రెటాతో పోల్చినప్పుడు, స్కోడా 34Nm టార్క్ ఎక్కువగా ఉంది. ఇది హ్యుందాయ్ CVT తో పోలిస్తే 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ను కలిగి ఉంటుంది. కుషాక్, క్రెటా 1.5-లీటర్ టర్బో- పెట్రోల్ ఇంజన్ ఎంపికను కలిగి ఉన్నప్పటికీ, హ్యుందాయ్ 10hp, 3Nm ద్వారా పవర్ ను పొందుతుంది. రెండు ఇంజన్లు 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జత చేయబడినప్పటికీ, క్రెటా 6 స్పీడ్ మాన్యువల్ ఎంపికను కూడా కలిగి ఉంది. హ్యుందాయ్ క్రెటా డీజిల్ ఆప్షన్ ను కూడా కలిగి ఉంది.
ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే క్రెటా 4330mm పొడవుతో 433 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. కుషాక్ 4225mm పొడవుతో 385 లీటర్ల బూట్ స్పేస్‌తో కొద్దిగా చిన్నది. అటు క్రెటా పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి. కుషాక్లో ఈజీ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్, ఆటో హెడ్‌ల్యాంప్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
క్రెటా ప్రస్తుతం NA పెట్రోల్ ధర రూ. 10.79 లక్షల నుంచి 18.97 లక్షల వరకు, టర్బో-పెట్రోల్ వేరియంట్‌కు రూ. 19.49-20.10 లక్షల మధ్య ఉంది. డీజిల్ ధర రూ. 12.40 లక్షల నుంచి 20.20 లక్షల మధ్య ఉంది. 2026 స్కోడా కుషాక్ అధికారిక ధర ఇంకా వెల్లడికాలేదు. మెరుగైన స్థలం, ఫీచర్ల కోసం క్రెటా, డ్రైవింగ్ అనుభూతి కోసం కుషాక్ బెస్ట్ ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు.
Read Also: న్యూ ఇయర్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసి కార్లు ఇవే, టాప్ ప్లేస్ లో ఏది ఉందంటే?