E-Paper
Advertisement

The Raja Saab Advance Bookings: విడుదలకు ముందే రికార్డులు.. షాక్‌కు గురిచేస్తున్న ది రాజా సాబ్ అడ్వాన్స్ కలెక్షన్స్

The Raja Saab Advance Bookings: విడుదలకు ముందే రికార్డులు.. షాక్‌కు గురిచేస్తున్న ది రాజా సాబ్ అడ్వాన్స్ కలెక్షన్స్
Advertisement

The Raja Saab Advance Bookings: తెలుగు సినిమా ది రాజా సాబ్..బాక్సాఫీస్ ప్రయాణాన్ని చాలా పాజిటివ్‌గా ప్రారంభించింది. సంక్రాంతి సందర్భంగా తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం జనవరి 9 విడుదలవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా, మారుతి దాసరి దర్శకత్వం వహించారు. సినిమా అధికారికంగా విడుదల కాకముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపించింది. ట్రైలర్, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్.. ఎన్నో రోజుల తర్వాత.. కామెడీ యాంగిల్ లో కనిపిస్తూ ఉండడంతో.. ఆయన అభిమానులు ఈ చిత్రం కోసం తెగ ఎదురు చూస్తూ వచ్చారు..

అదే అంచనాలు కొనసాగిస్తూ..ది రాజా సాబ్
.అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలంగా ఉన్నాయి. మొదటి రోజు ముందే ఒక లక్ష యాభై వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా సుమారు 4.31 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో బ్లాక్ చేసిన సీట్లు లెక్కలోకి తీసుకోలేదు. అవి కలిస్తే విడుదల రోజున కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Advertisement

దేశవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు మూడు వేల షోలలో ప్రదర్శితమవుతోంది. ప్రతి షోకి సగటున యాభై మందికిపైగా ప్రేక్షకులు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారీ మద్దతు లభించింది. అక్కడి నుంచి మాత్రమే సుమారు 3.5 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్స్ వచ్చాయి. రాష్ట్రంలో వెయ్యికిపైగా షోలు ఉన్నాయి. చాలా షోలు దాదాపు హౌస్‌ఫుల్ అవ్వగా.. మిగతావి వేగంగా నిండుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు టికెట్ జీవో ప్రకటించకపోవడంతో అక్కడి లెక్కలు ఇంకా కౌంట్ లోకి. రాలేదు

బ్లాక్ చేసిన సీట్లు కూడా కలిపితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే 6 కోట్ల రూపాయల మార్క్ దాటినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియర్ షోల టికెట్ ధరలు వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి. సాధారణ షోల టికెట్లు 250 నుంచి 370 రూపాయల మధ్య ఉన్నాయి. ఈ ధరలే సినిమాపై ఉన్న డిమాండ్‌ను చూపిస్తున్నాయి.

Advertisement

ఈ ఓపెనింగ్ ప్రభాస్‌కు చాలా కీలకం. ఆయన గత సినిమాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చినా..ప్రేక్షకుల్లో ఆయనపై నమ్మకం ఇంకా ఉంది. ఈ సినిమాలో ఎక్కువ భారం ప్రభాస్ మీదే ఉంది. పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ది రాజా సాబ్ కు కలిసి వచ్చింది. ఒక పెద్ద తమిళ సినిమా వాయిదా పడటంతో ఇండియా..ఓవర్సీస్ మార్కెట్లలో పోటీ తగ్గింది.

ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే.. మొదటి వీకెండ్‌లో సినిమా భారీ ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి మొదటి షో రిజల్ట్‌పైనే ఉంది.

ALSO READ: Raja Saab Twitter Review: ‘రాజా సాబ్ ‘ ట్విట్టర్ రివ్యూ..బొమ్మ బ్లాక్ బాస్టరేనా..?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×