E-Paper
Advertisement

The Raja Saab: ‘ది రాజా సాబ్’.. మరో కొత్త పంచాయితీ! వారికి పేమెంట్ ఇవ్వలేదా?

The Raja Saab: ‘ది రాజా సాబ్’.. మరో కొత్త పంచాయితీ! వారికి పేమెంట్ ఇవ్వలేదా?
Advertisement

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) క్రేజ్‌ను నమ్ముకుని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడమే కాకుండా, ఇప్పుడు తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. సినిమా ఫ్లాప్ అవ్వడంతో నిర్మాతలతో పాటు బయ్యర్లు కూడా భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన టెక్నీషియన్లు, వీఎఫ్ఎక్స్ (VFX) టీమ్‌లు, వివిధ స్టూడియోలకు రావాల్సిన పేమెంట్లు ఇంకా క్లియర్ కాలేదని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమా బడ్జెట్ పరంగా చాలా అవకతవకలు జరిగాయనేలా టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో నిర్మాత కూడా చాలా సీరియస్‌గా ఉన్నారని, ఏదో ఒక రోజు బరస్ట్ అవుతారనేలా ఇండస్ట్రీ అంతా కోడై కూస్తుంది. ఇప్పుడు మరో కొత్త పంచాయితీ.

Also Read- Psycho killer OTT: డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే సైకో… ఒక్కో మర్డర్ చూస్తే మతిపోవడం ఖాయం

ఫిలిం ఛాంబర్‌కు పంచాయితీ!

Advertisement

వాస్తవానికి సినిమా రిలీజ్ సమయంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, ఓటీటీ (OTT) డీల్ పూర్తి కాగానే వచ్చిన డబ్బులతో అందరి బాకీలు తీర్చేస్తామని నిర్మాత హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ, ఇప్పుడు సినిమా ఫలితం తేడా కొట్టడం, ఓటీటీ ఆదాయం వచ్చినా నిర్మాత స్పందించకపోవడంతో పనులు చేసిన వర్కర్లు ఆందోళన చెందుతున్నారు. ఫోన్లు చేసినా, నేరుగా కలవాలని ప్రయత్నించినా సరైన సమాధానం రాకపోవడంతో, విసిగిపోయిన బాధిత టెక్నీషియన్లు ఇప్పుడు ఫిలిం ఛాంబర్‌లో పంచాయితీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆ సంస్థ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుంది. మొదటి నుంచి ఈ సంస్థ అందరినీ అతిగా నమ్మడం, చివరకు ఇలా మోసపోవడం జరుగుతూ వస్తుంది. వంద సినిమాలు తీయాలనే డ్రీమ్ కంటే, చేసిన పది సినిమాలైనా ఎప్పటికీ గుర్తుండిపోవాలని సదరు నిర్మాత ఎప్పటికి తెలుసుకుంటారో..

Also Read- Allu Arjun AA23: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ తో చేయి కలిపిన అతని నలుగురు స్నేహితులు..!

పెద్దలు జోక్యం చేసుకుంటారా?

Advertisement

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, దాని కోసం పని చేసిన కింది స్థాయి కార్మికులకు, టెక్నీషియన్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఆపడం సరికాదనే చర్చ టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని నిర్మాతలు చెబుతుంటే, తమ రెక్కల కష్టానికి ఫలితం దక్కలేదని వర్కర్లు వాపోతున్నారు. ఈ వివాదం మరిన్ని మలుపులు తిరగకముందే పెద్దలు జోక్యం చేసుకుని ఈ పేమెంట్ పంచాయితీని సర్దుబాటు చేస్తారో లేదో చూడాలి. ఏదేమైనా, ఒక భారీ ప్రాజెక్టు ఇలా పేమెంట్ వివాదాల్లో చిక్కుకోవడం అటు ప్రభాస్ ఫ్యాన్స్‌ను, ఇటు ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. చూద్దాం.. ఫైనల్‌గా ఈ పంచాయితీ ఎలా ముగుస్తుందో..

Also Read- Sree vishnu: విష్ణు విన్యాసం, మృత్యుంజయ విడుదలపై శ్రీ విష్ణు క్లారిటీ.. బయటపడ్డానంటూ!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×