E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి అకస్మిక ప్రయాణాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి అకస్మిక ప్రయాణాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 19వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. 

వృషభం

Advertisement

కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది. 

మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆశించిన సహాయం లభించదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కర్కాటకం

Advertisement

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

సింహం

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. 

కన్య

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం

ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసే లాభాలు అందుకుంటారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. 

ధనుస్సు

చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్యవిషయాలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు.  

మకరం

చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. 

కుంభం

ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.

మీనం

భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు .గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×