E-Paper
Advertisement

The RajaSaab: ఒక్క మొసలి ఫైట్‌కే అన్ని కోట్లు పెట్టారా… అంతా ప్రభాస్‌కు నచ్చడం వల్లే!

The RajaSaab: ఒక్క మొసలి ఫైట్‌కే అన్ని కోట్లు పెట్టారా… అంతా ప్రభాస్‌కు నచ్చడం వల్లే!
Advertisement

The RajaSaab: సాధారణంగా కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయంటే.. సినిమా చరిత్ర ఉన్నంతకాలం వాటిని మర్చిపోలేరు అనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే డైరెక్టర్ అనుకున్న కొన్ని సన్నివేశాలను సినిమాలో చూపించాలనుకుంటారు. కానీ బడ్జెట్ లేదా ఇతర కారణాలవల్ల వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఒకవేళ హీరో గనుక అదే సీన్ ప్రేక్షకులకు చూపించాలని పట్టుబడితే మాత్రం తప్పని పరిస్థితుల్లో ఆ సీను పెడతారు. అయితే ఆ సీన్ వల్ల సినిమా ఫలితానికి ఎంత ఉపయోగముందో తెలియదు కానీ తమకు నచ్చిన సీన్లు పెట్టడం వల్ల అటు హీరోలు ఇటు దర్శకులు సంతృప్తి చెందుతారు అనడంలో సందేహం లేదు.

ఆ ఒక్క సీన్‌కే 23 కోట్లు? 

సరిగ్గా ఇలాగే ది రాజాసాబ్ సినిమాలో కూడా జరిగింది. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. జనవరి 9న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ రోజు రాత్రి నుంచి ప్రీమియర్ షోలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పుడే అందులో ఒక మొసలితో ప్రభాస్ ఫైట్ సీన్ అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీనిని థియేటర్లో చూడాలని అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Advertisement

అయితే ఈ ఒక్క ఫైట్ సీన్ కోసం ఏకంగా 23 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. నిజానికి ఒకానొక సమయంలో ఈ సీన్ వద్దు అనుకున్నారట డైరెక్టర్. కానీ హీరోకి ఆ సీన్ నచ్చడం వల్లే పట్టుబట్టి మరీ ఆ సీన్ చేయించారట. నిజానికి ఆ సీన్ కి బడ్జెట్ ఎక్కువని అనుకుంటే.. అవసరమైతే తన రెమ్యూనరేషన్ నుంచి కట్ చేసినా పర్వాలేదని, ఆ సీన్ ను మాత్రం సినిమాలో పెట్టండి అని చెప్పారట ప్రభాస్.

థియేటర్లలో ఆ సీన్ మెప్పిస్తుందా?

ఇకపోతే ప్రభాస్ అంత పట్టుబట్టి మరీ ఆ సీన్ సినిమాలో పెట్టించారంటే అది కచ్చితంగా థియేటర్లలో విజిల్ వేయిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ పట్టుబట్టినంత రేంజ్ లో ఆ మొసలితో ఫైట్ సీన్ గొప్పగా ఏం రాలేదట. అందుకే సినిమా నుంచి రిమూవ్ చేయాలని అనుకున్నారట. కానీ ఇప్పటికే ఆ సీన్ ట్రైలర్ ద్వారా బాగా వైరల్ అవ్వడంతో తప్పని పరిస్థితుల్లో సినిమాలోనే ఉంచుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సీన్ సినిమాలో ఉంచుదామా ? వద్దా? అన్న అనుమానాల మధ్య సినిమాలో జొప్పించిన ఈ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

Advertisement

also read: ది రాజాసాబ్ స్టోరీ ఇదే.. హారర్‌తో పాటు మైథలాజికల్ టచ్ కూడా!

ది రాజాసాబ్ సినిమా విశేషాలు..

ది రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్ , రిద్ది కుమార్, నిధి అగర్వాల్, జరీనా వాహబ్, బోమన్ ఇరానీ, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు . వీరితోపాటు జిషూ సేన్ గుప్తా, సుప్రీత్ రెడ్డి, సప్తగిరి, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, సత్య, వీటీవీ గణేష్ , వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఇక ఈరోజు రాత్రికి ఈ సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×