E-Paper
Advertisement

Medaram Jatara 2026: కేసీఆర్‌ను కలవనున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎందుకంటే?

Medaram Jatara 2026: కేసీఆర్‌ను కలవనున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎందుకంటే?
Advertisement

Medaram Jatara 2026: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈరోజు మధ్యాహ్నం కలవనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో (ఫామ్ హౌస్) ఈ భేటీ జరగనుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ బోన్ సర్జరీ చేయించుకుని ఇప్పుడిప్పడే కోలుకుంటున్న నేపథ్యంలో, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు అధికారికంగా ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం కూడా వారు వెళ్తున్నారు.

అయితే ఈ భేటీకి ముఖ్య కారణం, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. అయితే ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా జాతరకు రావాలని కోరుతూ మంత్రులు కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క ఈ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే సంప్రదాయం ప్రకారం రాష్ట్రంలోని ప్రముఖులను ఆహ్వానించే ప్రక్రియలో భాగంగా వారు కేసీఆర్‌ను కలవబోతున్నారు.

Advertisement

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మంత్రుల హోదాలో కొండా సురేఖ, సీతక్క.. కేసీఆర్‌ను కలవడం ఇదే మొదటిసారి. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు పక్కన పెట్టి, రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అయిన మేడారం జాతర విషయంలో ప్రభుత్వం అందరినీ కలుపుకుపోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖులను ఆహ్వానించాల్సిందిగా మంత్రులకు సూచించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: విషాదం.. ప్రియుడు వేధించాడని వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

Advertisement

ఇటీవల కేసీఆర్ శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటుండటంతో, ఆయన ఆరోగ్యంపై మంత్రులు ఆరా తీయనున్నారు. మేడారం జాతరలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, గతంలో జరిగిన ఏర్పాట్లు వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వారా అటు భక్తి భావం, ఇటు రాజకీయ మర్యాద రెండింటినీ మంత్రులు చాటుతున్నారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×