E-Paper
Advertisement

The RajaSaab: ది రాజాసాబ్ స్టోరీ ఇదే.. హారర్‌తో పాటు మైథలాజికల్ టచ్ కూడా!

The RajaSaab: ది రాజాసాబ్ స్టోరీ ఇదే.. హారర్‌తో పాటు మైథలాజికల్ టచ్ కూడా!
Advertisement

The RajaSaab:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas).. మారుతీ(Maruthi )దర్శకత్వంలో కామెడీ, హారర్ బ్యాక్ డ్రాప్ లో తొలిసారి చేస్తున్న చిత్రం ది రాజాసాబ్. నిధి అగర్వాల్, రిద్దీ కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రేపు అనగా జనవరి 9న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్లు మొదలవగా తెలంగాణలో మరికాసేపట్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం ప్రీమియర్ బుకింగ్ షోల ద్వారానే 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ది రాజాసాబ్ సినిమా స్టోరీ..

ఇదిలా ఉండగా తాజాగా ది రాజాసాబ్ సినిమాకు సంబంధించిన కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ సినిమా స్టోరీ విన్న తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. పైగా ప్రీమియర్ షో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని కూడా ఎదురు చూస్తున్నారు. మరి రాజాసాబ్ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రభాస్ తో పాటూ ముగ్గురు హీరోయిన్లు (నిధి అగర్వాల్, రిద్దీ కుమార్, మాళవిక మోహనన్) ఒక ఇంట్లోకి వెళ్తారు. అయితే అది ఒక మాయ ఇల్లు. చనిపోయిన ప్రభాస్ తాత ఆ ఇంట్లోనే ఉంటాడు దెయ్యంగా.. కట్ చేస్తే ఆ ఇంట్లోకి వెళ్లడమే కానీ, బయటికి రావడానికి ఆప్షన్ ఉండదు. డోర్స్ ఉండవు. ఉన్నా అవి పని చేయవు.

Advertisement

also read:Sankranthi Movie’s: సంక్రాంతి బరి నుండి మరో మూవీ అవుట్.. అసలేం జరుగుతోంది?

హారర్ తోపాటు మైథలాజికల్ టచ్..

ఆ ఇంట్లో నుంచి బయటికి రావాలంటే.. ఏడు లోకాలు దాటినట్టు.. ఏడు డోర్స్ లాక్ లను ఓపెన్ చేయాలి. దీన్ని బట్టి చూస్తే ఏడు లోకాలు అంటూ స్టోరీకి డివోషనల్ టచ్ కూడా ఇచ్చారు. ఇక ఆ తలుపుల తాళంచెవిలను పట్టుకోవడానికి హీరో ట్రై చేస్తారు. లాస్ట్ లో బోమన్ ఇరానీ కూడా ఇంట్లోకి వచ్చి ఆ కీ లను వెతకడంలో సాయం చేస్తారు.

క్లైమాక్స్ ఇదే..

Advertisement

ఇక క్లైమాక్స్ లో హీరో నానమ్మ కూడా వచ్చి ఆ కీ లను వెతకడం మొదలు పెడుతుంది. అలా వెతికే టైంలో అడ్డుగా వస్తున్న తాత దెయ్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని కొన్ని ట్రిక్స్ చెప్తుంది. అలా నానమ్మ వల్ల ఆ మాయా ఇంటి నుంచి బయటపడతారు. అలా అద్భుతమైన కథతో ఈ సినిమా ఈరోజు రాత్రికి ప్రీమియర్ గా రానుంది. మరి ఈ స్టోరీని తెరపై విజువల్ గ్రాండీరియర్ గా చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికైతే ఇన్ని రోజులు హారర్ కామెడీ అంటూ చెప్పుకొచ్చిన ఈ సినిమాలో ఇప్పుడు మైథలాజికల్ టచ్ కూడా ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో మినిమం 400 కోట్లు రాబట్టడం గ్యారెంటీ అని అభిమానులు కూడా చెబుతున్నారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×