E-Paper
Advertisement

SS Thaman : పాపం తమన్… బాలీవుడ్ పట్టించుకోవడం లేదు

SS Thaman : పాపం తమన్… బాలీవుడ్ పట్టించుకోవడం లేదు
Advertisement

SS Thaman : తెలుగు ఇండస్ట్రీలో తమన్‌కు తిరుగు లేదు. అందులో ఎలాంటి డౌట్‌ లేదు. తమిళ ఇండస్ట్రీలో కూడా తమన్‌కు మంచి పేరే ఉంది. కానీ, బాలీవుడ్‌లో అలాంటి పరిస్థితి లేదు. అక్కడ తమన్ గురించి పెద్దగా తెలియదు. కారణం అక్కడ సినిమాలు చేయకపోవడమే అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే.. ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ నిన్న (సోమవారం) రిలీజ్ అయింది. ట్రైలర్‌కు బానే ప్రశంసలు వచ్చాయి. అలాగే మ్యూజిక్ కొట్టిన తమన్‌ను కూడా శభాష్ అని అన్నారు. అయితే.. బాలీవుడ్‌లో మాత్రం తమన్‌కు అలాంటి గుర్తింపు రాలేదు.

సోమవారం ది రాజా సాబ్ 2.o ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా మంది ప్రముఖులు రెస్పాండ్ అయ్యారు. అది పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ మూవీ కాబట్టి… బాలీవుడ్ కూడా ఫోకస్ చేస్తుంది. అలా రాజా సాబ్ ట్రైలర్‌పై బాలీవుడ్ సినీ జర్నలిస్ట్‌లు కూడా రెస్పాండ్ అయ్యారు. మారుతి వర్క్‌పైన, ప్రభాస్ పైన, సంజయ్ దత్, హీరోయిన్లతో పాటు సినిమాలో కనిపించే ఇతర నటీనటులను కూడా మెన్షన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

కానీ, ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. అందరి పేర్లు పెట్టి.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరును మర్చిపోయాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో ఇంట్రాక్ట్ అయ్యే తమన్ కంట ఆ పోస్ట్ పడ్డది. ఇంకేముంది.. వెంటనే రిప్లై ఇచ్చాడు ఆ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు. “అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చినది తమన్. అతని ట్విట్టర్ ఐడి ఇదే” అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌ను కూడా ట్యాగ్ చేశాడు.

దీంతో తమన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తెలుగులో మంచి మ్యూజిక్ డైరెక్టరే అయినా.. బాలీవుడ్ వాళ్లకు తమన్ పెద్దగా పరిచయం లేదు అని అంటున్నారు. తమన్ ఇప్పటి వరకు రెండు మాత్రమే స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశాడు.

Advertisement

ఫస్ట్ మూవీ బేబీ జాన్. అట్లీ ఇచ్చిన కథతో ఈ సినిమా వచ్చింది. తమనే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. దీని తర్వాత గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో సన్నీ డియోల్ నటించిన జాట్ అనే హిందీ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమా హిట్ అయినా… తమన్‌కు పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు ది రాజా సాబ్ మూవీ డైరెక్ట్ హిందీ మూవీ కాకపోయినా.. బాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ వల్ల తమన్‌కు వర్క్‌కు పేరు వస్తే రావొచ్చు.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×