E-Paper
Advertisement

Viral Video: నా లవర్‌ను అలా పిలుస్తావా.. నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని పొట్టుపొట్టు..?

Viral Video: నా లవర్‌ను అలా పిలుస్తావా.. నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని పొట్టుపొట్టు..?
Advertisement

Viral Video: ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఓ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఒక అమ్మాయి కోసం ఇద్దరు యువకులు గొడవపడటం మనం తరచుగా చూస్తుంటాం. కానీ..  ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఒక యువకుడి కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డుపైనే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.

ఈ గొడవకు ప్రధాన కారణం ఒక చిన్న పిలుపు. తన ప్రియుడిని (బాయ్‌ఫ్రెండ్) మరో యువతి ‘బాబు’ అని పిలవడాన్ని సదరు యువతి తట్టుకోలేకపోయింది. నా బాయ్‌ఫ్రెండ్‌ను నువ్వు ‘బాబు’ అని ఎలా పిలుస్తావు అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. మాట మాట పెరగడంతో అది కాస్తా ఘర్షణకు దారితీసింది. పట్టరాని కోపంతో ఉన్న ఆ యువతి..  రెండో యువతిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. రోడ్డుపైనే ఆమెను కిందపడేసి చావబాదింది.

Advertisement

ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడున్న వారు కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. అందులో ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు నెట్టుకుంటూ, జుట్టు పట్టుకుని కొట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడే ఉన్న సదరు యువకుడు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ..  వారు మాత్రం తగ్గలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ప్రేమలో ఇంత అసూయ ఉంటుందా?’ అని కొందరు ఆశ్చర్యపోతుంటే, మరికొందరు ఈ చర్యను తప్పుబడుతున్నారు.

చిన్నపాటి కారణంతో నడిరోడ్డుపై ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూపీలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ALSO READ: Komatireddy Venkat Reddy: సంక్రాంతి పండగ ట్రాఫిక్‌పై మంత్రి కోమటిరెడ్డి రివ్యూ

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×