E-Paper
Advertisement

The Rajasaab: రాజా సాబ్ నుంచి మరో ట్రైలర్..ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్!

The Rajasaab: రాజా సాబ్ నుంచి మరో ట్రైలర్..ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్!
Advertisement

The Rajasaab : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే రెండు పాటలను కూడా విడుదల చేశారు. ఇలా పాటలు, ట్రైలర్ వీడియో సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ తెలియజేశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరొక ట్రైలర్ రాబోతోందని తెలుస్తోంది.

డిసెంబర్ 27న ప్రీ రిలీజ్ ఈవెంట్?

ఈ సినిమా నుంచి మరొక ట్రైలర్ విడుదల చేయబోతున్నారని అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో ఉండదని కేవలం యుఎస్ లో మాత్రమే ఉండబోతోందని వార్తలు బయటకు వచ్చాయి. కానీ డిసెంబర్ 27వ తేదీ హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారని ఈ వేడుకలో భాగంగా ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతుంది..

హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్..

Advertisement

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 25వ తేదీ యుఎస్ లో నిర్వహించబోతున్నారని, ట్రైలర్ జనవరి ఒకటో తేదీ విడుదల చేయబోతున్నారంట గతంలో వార్తలు వచ్చాయి కానీ తాజాగా తెలుగులో కూడా ఈ సినిమా వేడుకను ఘనంగా నిర్వహించాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఇలా హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుక జరగబోతుందనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి సహనా అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఈ పాట మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు..

Advertisement

ఇటీవల కాలంలో ప్రభాస్ పిరియాడిక్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ సినిమాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే మొదటిసారి హర్రర్ కామెడీ థ్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నప్పటికీ అనుకున్న విధంగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.

Also Read: Suriya: సింగం ఈస్ బ్యాక్.. మళ్లీ యూనిఫాం వేయబోతున్న సూర్య!

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×