E-Paper
Advertisement

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు కిస్సులు ఇచ్చి మ‌రీ రెచ్చ‌గొట్టిన లేడీ.. బ‌లైన ద‌క్షిణాఫ్రికా

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు కిస్సులు ఇచ్చి మ‌రీ రెచ్చ‌గొట్టిన లేడీ.. బ‌లైన ద‌క్షిణాఫ్రికా
Advertisement

Hardik Pandya: భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య ముగిసిన ఐదు టి-20 ల సిరీస్ లో.. నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్ లో భారత జట్టు బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ చివరి టి-20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ నమోదు చేసింది.

Also Read: Hardik Pandya-Cameraman: కెమెరామెన్ కు హగ్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. చేయి విర‌గ్గొట్టి మ‌రీ

Advertisement

యువ బ్యాటర్ తిలక్ వర్మ {73}, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా {63} హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్ అంటే చెలరేగిపోయే హార్దిక్ పాండ్యా.. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపాడు. మెరుపు హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. టి-20 వరల్డ్ కప్ సన్నాహక సిరీస్ తో పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా.. ఈ చివరి టి-20 లో 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్ లతో దక్షిణాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించాడు.

 

16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ:

Advertisement

115/3 దశలో కెప్టెన్ సూర్య కుమార్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. ఆలస్యం చేయకుండా వచ్చిన వెంటనే ఉతుకుడే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో లిండే, బోష్ ఓవర్లలో బౌండరీలతో రెచ్చిపోయి 16 బంతులలోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కూడా తనదైన విధ్వంసకర బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తద్వారా అంతర్జాతీయ టి-20 ఫార్మాట్ లో భారత్ తరపున ఫాస్టెస్ట్ 50 సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు హార్థిక్ పాండ్యా. ఈ క్రమంలో అభిషేక్ శర్మను అధిగమించి.. మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. హార్దిక్ పాండ్యా మొత్తంగా కేవలం 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 63 పరుగులు సాధించి సఫారీ బౌలర్లను హడలెత్తించాడు.

 

హార్థిక్ పాండ్యాకు కిస్సులు ఇచ్చిన మహిక:

ఈ చివరి టి-20 లో హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ చూసేందుకు తన గర్ల్ ఫ్రెండ్ మహిక శర్మ స్టేడియానికి వచ్చింది. అయితే హార్దిక్ పాండ్యా 14వ ఓవర్ లో వరుసగా 4, 6, 6, 4 బాది.. చివరి 4 బంతుల్లోనే 20 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్ ముగిసిన అనంతరం తన గర్ల్ ఫ్రెండ్ మహిక శర్మకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరీ సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా ఫ్లయింగ్ కిస్ చూసిన మహిక.. అదే స్టైల్ లో స్పందించింది. మహిక కూడా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కి ఫిదా అయి సంతోషంతో రిటర్న్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.

Also Read: Smriti Mandhana: ల‌వ‌ర్ టెన్ష‌న్ లేదు.. స్మృతి మందాన బ‌రితెగింపు ? పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని !

ఆ సమయంలో మహిక స్టాండ్స్ లో ఎంతో ఉత్సాహంగా కనిపించింది. దీంతో వీరిద్దరూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల హార్దిక్ పాండ్యా మహిక తో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఈ మ్యాచ్ కి ముందు మహిక శర్మ కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. పలువురిపై హార్థిక్ పాండ్యా ఆసనం వ్యక్తం చేస్తూ విమర్శించాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ కి ముందు వీరిద్దరూ అక్కడ చెక్కర్లు కొట్టిన వీడియోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by India Forums (@indiaforums)

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×