E-Paper
Advertisement

Suriya: సింగం ఈస్ బ్యాక్.. మళ్లీ యూనిఫాం వేయబోతున్న సూర్య!

Suriya: సింగం ఈస్ బ్యాక్.. మళ్లీ యూనిఫాం వేయబోతున్న సూర్య!
Advertisement

Suriya: కోలీవుడ్ స్టార్ గా కొనసాగుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోలలో సూర్య (Suriya) ఒకరు. ఈయన పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.. ఇప్పటికే సూర్య నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా తాజాగా మరో సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ప్రస్తుతం సూర్య తన 47వ సినిమాని మలయాళ స్టార్ డైరెక్టర్ జిత్తు మాధవన్ (Jithu Madhavan)దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య..

ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రోమోకి సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది అయితే ఈ సినిమాలో సూర్య పాత్రకు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో మరోసారి సూర్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని సమాచారం. పోలీస్ స్టోరీలు అనగానే టక్కున సూర్య గుర్తుకు వస్తారు అంత అద్భుతంగా ఈయన పోలీస్ పాత్రలలో ఇమిడిపోతారని చెప్పాలి. సూర్య ఇదివరకు నటించిన సింగం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతమైన నటనను కనబరిచారు.

నెగటివ్ పాత్రలో సూర్య..

Advertisement

ఈ నేపథ్యంలోనే జిత్తు మాధవన్ దర్శకత్వంలో సూర్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి సూర్య ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా suriya 47 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఆవేశం లాంటి సెన్సేషనల్ సినిమాకు దర్శకత్వం వహించిన జిత్తు మాధవన్ డైరెక్షన్ లో సూర్య నెగిటివ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలిసిన అభిమానులు ఈ సినిమా పట్ల ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు.

విశ్వనాథన్ అండ్ సన్స్..

Advertisement

ఇక సూర్య ఇదివరకే కరుప్పు సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో కూడా సూర్య నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఇటీవల షూటింగ్ పనులను పూర్తిచేసుకుంది.. ఈ సినిమాకు విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని 2026 సమ్మర్లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఇక ఈ రెండు సినిమాలు తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. ఇక సూర్య చివరిగా రెట్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైన పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

Also Read: The Paradise: రెండు భాగాలుగా నాని ది ప్యారడైజ్.. స్క్రిప్ట్ కూడా రెడీ?

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×