E-Paper
Advertisement

The Rajasaab : ప్రభాస్ రాజా సాబ్ ఓటీటీ డీల్ సెట్, భారీ రేట్ కు కొనుగోలు చేసిన ఆ సంస్థ

The Rajasaab : ప్రభాస్ రాజా సాబ్ ఓటీటీ డీల్ సెట్, భారీ రేట్ కు కొనుగోలు చేసిన ఆ సంస్థ
Advertisement

The Rajasaab : మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా డి రాజా సాబ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దర్శకుడు మారుతి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇప్పటివరకు మారుతి చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. పక్కా కమర్షియల్ వంటి సినిమాలు ఊహించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా కూడా డిజాస్టర్ అయితే కాలేదు.

మారుతి స్ట్రెంత్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ గా మారుతి చాలా అద్భుతంగా రాస్తాడు. ఒక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఒక్క ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా ప్రభాస్ తర్వాత కాలంలో చేయలేదు. అయితే మారుతి ప్రభాస్ తో ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం అనే ఉద్దేశంతోనే ది రాజా సాబ్ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది.

రాజా సాబ్ ఓటీటీ డీల్ సెట్

Advertisement

రాజ సాబ్ సినిమాకి సంబంధించి ఓటిటి డీల్ ఇంకా కుదరలేదు అని, సినిమాకి సరైన బిజినెస్ జరగలేదు అని పలు రకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. మొత్తానికి సంక్రాంతి రిలీజ్ కూడా ఉండకపోవచ్చు అని చాలామంది ఇండస్ట్రీ వర్గాల్లోనే మాట్లాడుకున్నారు. మొత్తానికి వీటన్నిటికీ చెక్ పడినట్లు తెలుస్తుంది.

ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాను హాట్ స్టార్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలో వస్తుంది. అయితే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ 

Advertisement

ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కేవలం ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకట్టుకునేలా ఉండబోతుంది అని సమాచారం వినిపిస్తుంది. సినిమాకి సంబంధించి సెకండాఫ్ మొత్తం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

సంక్రాంతి రేసులో మొదట ఈ సినిమా విడుదల అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ కానీ వచ్చిందా.? ఈ సినిమాకి సంబంధించి అద్భుతమైన కలెక్షన్లు చూడొచ్చు. ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సాంగ్ కూడా బాగానే ఆకట్టుకుంది.

Also Read: Bigg boss Telugu 9 Promo : మొహం మీద కొట్టడం ఒకటే తక్కువ, భరణి కళ్యాణ్ మద్య భారీ గొడవ

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×