E-Paper
Advertisement

Hawala Money: రూ.4 కోట్ల నగదు అక్రమ తరలింపు.. సినిమా స్టైల్‌లో 15 కిమీలు ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

Hawala Money: రూ.4 కోట్ల నగదు అక్రమ తరలింపు.. సినిమా స్టైల్‌లో 15 కిమీలు ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
Advertisement

Hawala Money: సికింద్రాబాద్‌లో పుష్ప సినిమా తరహాలో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా పట్టుబడింది. గుట్టు చప్పుడు కాకుండా డబ్బు తరలిస్తున్న కారును దాదాపు 15 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. బోయిన్‌పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, కారు డిక్కీ, టైర్లు, సీట్లలో డబ్బు కట్టలు దాచారని తెలిపారు. ఈ ఆపరేషన్‌ ద్వారా రూ.4 కోట్ల నగదు, హవాలా ముఠా ఉపయోగించిన కారును సీజ్ చేశారు.

కారు టైర్లలో నగదు.. ఖంగుతిన్న పోలీసులు:

విశ్వసనీయ వర్గాల నుంచి పక్కా సమాచారం అందుకున్న బోయిన్‌పల్లి పోలీసులు.. హవాల డబ్బు తరలిస్తున్న ముఠా కోసం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను గమనించిన హవాలా ముఠా కారుతో ఉడాయించారు. అయినప్పటికీ.. వదిలిపెట్టని పోలీసులు హవాలా డబ్బు తరలిస్తున్న కారును ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. కారు ఓపెన్ చేసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అచ్చం పుష్ప సినిమాలో మాదిరిగానే.. కారు టైర్లు, సీట్లలో హవాలా నగదును దాచారు. దీంతో పోలీసులు కారు మొత్తం తనిఖీ చేయగా.. రూ.4 కోట్ల నగదు దొరికింది. దీంతో కారును సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×