E-Paper
Advertisement

Bigg boss Telugu 9 Promo : మొహం మీద కొట్టడం ఒకటే తక్కువ, భరణి కళ్యాణ్ మద్య భారీ గొడవ

Bigg boss Telugu 9 Promo : మొహం మీద కొట్టడం ఒకటే తక్కువ, భరణి కళ్యాణ్ మద్య భారీ గొడవ
Advertisement

Bigg boss Telugu 9 : బిగ్ బాస్ 9 లో ఫ్యామిలీ వీక్ కు సంబంధించి భరణి కోసం నాగబాబు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు హౌస్ లోకి వచ్చినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు చెప్పారు. భరణి హౌస్ లో రేలంగి మామయ్య లాగా ఉంటున్నాడు భరణి ఒరిజినాలిటీ అది కాదు. భరణి చాలా మారిపోయాడు. భరణి అప్పట్లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అయితే ఆ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం వలనే ఎవరితోనైనా కూడా ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే మొహం మీద కొట్టి మాట్లాడేవాడు.

అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బుద్ధిమంతుడులా తయారైపోయాడు. ఇప్పుడు భరణి ఇలా ఉండటం కూడా నాకు నచ్చడం లేదు. భరణిని కొంతమేరకు తగ్గాలి అని మేమే చెప్పాము. కానీ మరీ ఇంతలా తగ్గటం నాకు ఇష్టం లేదు అని ఫ్యామిలీ వీక్ లో చెప్పారు నాగబాబు. అయితే ఇప్పుడు భరణి ఒరిజినాలిటీ కొద్దికొద్దిగా బయటకు వస్తుంది అని చెప్పాలి.

మొహం మీద కొట్టడం ఒకటే తక్కువ 

Advertisement

ఫైనల్ కెప్టెన్ గా బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ ఎన్నికైన విషయం తెలిసిందే. కళ్యాణ్ కు భరణికి మధ్య బిగ్ బాస్ హౌస్ లో భారీ గొడవ జరిగింది. భరణి మాట్లాడుతూ ఎవరెవరు ఎక్కడ మార్క్స్ పెట్టారు తెలుసు అంటూ ఏదో టాస్క్ గురించి మాట్లాడారు. అవన్నీ తెలిసి కూడా నేను చాలా సైలెంట్ గా ఉన్నాను అన్నారు భరణి.

అలా మాట్లాడుతున్న తరుణంలోనే కళ్యాణ్ కన్ఫెక్షన్ రూమ్ లో మీకు ఏ వీడియో చూపించారో నాకు తెలుసు అంటూ మాట్లాడాడు. నాకు తెలిసిన విషయం ఇప్పటివరకు నేను పవన్ కి కూడా చెప్పలేదు అంటూ భరణిపై రెచ్చిపోయాడు కళ్యాణ్.

Advertisement

భరణి కూడా ఏ మాత్రం తగ్గకుండా నేను నీ పేరు బయటకు తీసానా అంటూ మీద మీదకు వెళ్లాడు. కేవలం మొహం మీద మాత్రం కొట్టకుండా మాట్లాడుతూ తన ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ విషయం కూడా ఎందుకు చెబుతున్నామంటే గతంలో నాగబాబు మాట్లాడుతూ ఏదైనా కొట్టి మాట్లాడుతాడు అని చెప్పారు కాబట్టి.

మొత్తానికి ప్రస్తుతం భరణి మీద కూడా విపరీతమైన పాజిటివ్ ఒపీనియన్ చాలామందికి వస్తుంది. టాస్కులు కోసం కంప్లీట్ ఎఫెక్ట్ పెడుతున్నాడు భరణి. ఈ ఏజ్ లో కూడా ఆ స్థాయిలో టాస్కులు ఆడటం అనేది మామూలు విషయం కాదు. కొన్ని సందర్భాలలో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని భరణి ఆడే తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Also Read: Akhanda 2 : 6వ తారీఖు టికెట్స్ ఓపెన్, అంటే రేపు సినిమా రిలీజ్ కానట్లేనా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×