E-Paper
Advertisement

Varanasi Movie : మహేష్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘వారణాసి’ షూటింగ్ ఎక్కడంటే..?

Varanasi Movie : మహేష్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘వారణాసి’ షూటింగ్ ఎక్కడంటే..?
Advertisement

Varanasi Movie : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం జనాలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు వారణాసి అని టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలని మహేష్ అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.. ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం..

‘వారణాసి ‘ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే..?

మహేష్ బాబు ఇప్పటివరకు ఫ్యామిలీ కథా చిత్రాలలో నటించి మెప్పించాడు.. చివరగా గుంటూరు కారం మూవీలో నటించాడు.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు వారణాసి సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు ప్రమోషనల్ ఈవెంట్, ఆ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ యావత్ ప్రపంచంలోని సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది. దాంతో ఒక్కసారిగా ఈ మూవీ పై భారీ హైప్ నెలకొంది.. ఇక మహేష్ వేకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. రీసెంట్ గా ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు..రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్‌ ను నిర్మించారు మేకర్స్. ఈ మూవీ కోసం హైదరాబాద్ లో కాశీని తలపించేలా ఓ భారీ సెట్ ను నిర్మాతలు కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. ఈ సెట్ లోనే తాజాగా షూటింగ్ జరుగుతోంది..ప్రస్తుతం మహేశ్ బాబు మీద ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారని తెలుస్తోంది. ఈ సీను ఈ సినిమాకి హైలెట్ గా నిలవని ఉందని సమాచారం.

Advertisement

Also Read :ప్రతాప్ నుంచి తప్పించుకున్న భూషణ్.. రౌడీల నుంచి తప్పించుకున్నారు మహా, చక్రి.. నెక్స్ట్ ట్విస్ట్..?

రాముడు పాత్రలో మహేష్…

ఈ సినిమాను రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు.. అలాగే నటుడు ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈయన షూటింగ్లో జాయిన్ అయ్యారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు అన్న విషయం తెలిసిందే. ఆ పాత్రలో మహేష్ బాబు ఎలా ఉంటాడో చూడాలని ఆయన అభిమానులు సినిమాని అనౌన్స్చేసినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ కోసమే మహేష్ బాబు గుబురు గడ్డం జుట్టును పెంచిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ని త్వరగా పూర్తిచేసి ప్రమోషన్స్ కార్యక్రమాలను భారీ ఎత్తున మొదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో రాజమౌళి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడబోతుందేమో చూడాలి..

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×