E-Paper
Advertisement

డుకాటి ఫార్ములా 73 విడుదల, లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

డుకాటి ఫార్ములా 73 విడుదల, లుక్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Ducati Formula 73 Limited Edition: పాపులర్ ప్రీమియం బైక్ తయారీ సంస్థ డుకాటి భారత మార్కెట్లోకి మరో స్పెషల్ మోడల్ ను తీసుకొచ్చింది. డుకాటి ఫార్ములా 73ను రూ.20 లక్షల ఎక్స్‌ షోరూమ్ ధరతో విడుదల చేసింది. రెట్రో లుక్‌తో పాటు అత్యాధునిక టెక్నాలజీని కలిపి రూపొందించిన ఈ కేఫ్ రేసర్ బైక్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 873 యూనిట్లను విడుదల చేసింది. భారత్‌కు కేటాయించిన బైక్‌లన్నీ ఇప్పటికే బుక్ కావడం ఈ మోడల్‌ పై ఉన్న క్రేజ్ ను  తెలియజేస్తోంది.

1973 నాటి బైక్‌కు గుర్తుగా కొత్త మోడల్

డుకాటి ఫార్ములా 73 ప్రత్యేకత దాని తయారీ కంపెనీ చరిత్రను తెలియజేస్తోంది. 1973లో బాగా పాపులర్ అయిన 750 సూపర్ స్పోర్ట్ డెస్మో బైక్ స్ఫూర్తితో దీన్ని తయారు చేశారు. డెస్మోడ్రోమిక్ వాల్వ్ టైమింగ్ వ్యవస్థను ఉపయోగించిన తొలి డుకాటి రోడ్ బైక్‌గా 750 సూపర్ స్పోర్ట్ డెస్మోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1972లో జరిగిన 200 మిగ్లియా డి ఇమోలా రేసులో పాల్ స్మార్ట్, బ్రూనో స్పాగియారి అందుకున్న సక్సెస్ తో మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఆ విజయానికి గుర్తుగా రూపొందిన పాత మోడల్ డిజైన్ ను సరికొత్తగా అప్ డేట్ చేశారు.

రెట్రో లుక్.. స్పెషల్ కలర్ కాంబినేషన్

Advertisement

ఈ బైక్‌ లో సిల్వర్, ఆక్వా గ్రీన్ కలర్ మిక్సింగ్ ఆకట్టుకుంటుంది. ఫ్యూయల్ ట్యాంక్‌ పై నిలువుగా ఉండే బంగారు రంగు గీత పాత ఇమోలా డెస్మో మోడల్‌ను గుర్తుకు తెస్తుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్‌ బార్లు, బార్ ఎండ్ మిర్రర్లు, చిన్న ఫెయిరింగ్, వెనుకవైపు సన్నబడే టెయిల్ భాగం దీనికి క్లాసిక్ కేఫ్ రేసర్ లుక్ ఇస్తాయి. లివర్లు, ఫుట్‌ పెగ్‌లు, రిజోమా ఫ్యూయల్ క్యాప్ లాంటి కొన్ని భాగాలను బిల్లెట్ అల్యూమినియంతో రూపొందించారు.

803cc ఇంజిన్.. 73hp పవర్..

డుకాటి ఫార్ములా 73లో 803cc డెస్మోడ్యూ L-ట్విన్ ఇంజిన్‌ ను అమర్చారు. ఇది 8,250rpm దగ్గర 73hp శక్తిని, 7,000rpm దగ్గర 65.2Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ కోసం ప్రత్యేకంగా డెవలప్ చేసిన టెర్మిగ్నోని ఎగ్జాస్ట్‌ ను కూడా అందించారు. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, 41mm KYB USD ఫోర్క్, ప్రీలోడ్ అడెస్ట్ చేసుకునే KYB మోనోషాక్ సస్పెన్షన్ ఇందులో ఉన్నాయి.

అత్యాధునిక ఫీచర్లు.. లిమిటెడ్ యూనిట్స్..   

Advertisement

కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్, రెండు రైడింగ్ మోడ్‌లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే, ఫుల్ LED లైటింగ్ కూడా అందించారు. హీటెడ్ గ్రిప్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను అదనపు యాక్సెసరీలుగా పొందవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా తయారు చేసిన 873 బైక్‌లలో ప్రతి దానిపై ప్రత్యేక సీరియల్ నంబర్ ఉంటుంది. అరుదైన డిజైన్, చారిత్రక నేపథ్యం, ఆధునిక ఫీచర్ల కలయికతో ఫార్ములా 73 కలెక్టర్లను ఆకట్టుకునే మోడల్‌గా నిలవనుంది.

Read Also: TFT డిస్‌ ప్లే, క్విక్‌షిఫ్టర్‌.. అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ NS200 గ్రాండ్ ఎంట్రీ!

Tags

Related News

సింగిల్ ఛార్జింగ్‌తో 343 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

TFT డిస్‌ ప్లే, క్విక్‌షిఫ్టర్‌.. అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ NS200 గ్రాండ్ ఎంట్రీ!

వెదురుతో పెట్రోల్.. 10 నిమిషాల్లోనే తయారీ, లీటర్ ధర ఎంతో తెలుసా?

కార్లలో ఇకపై బ్లాక్ బాక్స్.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేస్తుందట, ఇదిగో ఇలా..

బేయాన్ To 0 ఆల్ఫా.. డిసెంబర్ లో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న 4 క్రేజీ SUVలు!

ఇక క్లచ్ పట్టాల్సిన అవసరం లేదు.. కవాసకీ కొత్త అడ్వెంచర్ బైక్‌ భలే ఉందిగా..

భారత్‌లోనే CB500 తయారీ.. విదేశాలకు ఎగుమతి చేసేందుకు హోండా ప్లాన్!

Big Stories

Advertisement
×