E-Paper
Advertisement

IND VS NZ 3rd Odi: కోహ్లీ, హ‌ర్షిత్ రాణా పోరాటం వృథా..37 ఏళ్ల త‌ర్వాత‌ వ‌న్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా

IND VS NZ 3rd Odi:  కోహ్లీ, హ‌ర్షిత్ రాణా పోరాటం వృథా..37 ఏళ్ల త‌ర్వాత‌ వ‌న్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా
Advertisement

IND VS NZ 3rd Odi:  టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కచ్చితంగా గెలవాల్సిన ఇండోర్ వన్డేలో ( India vs New Zealand, 3rd ODI ) దారుణంగా ఓడిపోయింది గిల్ సేన. న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 41 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా… 3 వన్డేల సిరీస్ కోల్పోయింది. 2-1 తేడాతో ఈ వన్డే సిరీస్ ను అవలీలగా గెలుచుకుంది న్యూజిలాండ్ టీం. చివరి వరకు విరాట్ కోహ్లీ అలాగే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, అటు డేంజర్ ఆల్ రౌండర్, గంభీర్ శిష్యుడుగా పేరుగా హర్షిత్ రాణా పోరాడినప్పటికీ టీమిండియా మాత్రం ఓడిపోవలసి వచ్చింది. న్యూజిలాండ్ విధించిన 337 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా 46 ఓవర్లలో 296 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది టీమిండియా.

Also Read: Shubman Gill water purifier : ఇండోర్ లో మూడో వ‌న్డే..గిల్ కోసం స్పెష‌ల్ వాట‌ర్ ఫ్యూరిఫైర్‌..ఎన్ని ల‌క్ష‌లంటే

కోహ్లీ, హ‌ర్షిత్ రాణా పోరాటం వృథా

Advertisement

న్యూజిలాండ్ తో జరిగిన ఇండోర్ వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అలాగే హర్షిత్ రానా చివరి వరకు పోరాడారు. అయినప్పటికీ టీమిండియా గెలవలేదు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 108 బంతుల్లో 124 పరుగులతో దుమ్ము లేపాడు. అటు నితీష్ కుమార్ రెడ్డి 57 బంతుల్లో 53 పరుగులు సాధించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అర్థ సెంచరీ పూర్తయిన తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత వచ్చిన గౌతమ్ గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా 43 బంతుల్లోనే తన తొలి అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ కంటే భయంకరంగా బ్యాటింగ్ చేశాడు హర్షిత్. దీంతో మ్యాచ్ గెలుస్తుందని అనుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది. వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. చివరలో విరాట్ కోహ్లీ అయిన గెలిపిస్తాడని అందరు అనుకున్నారు. కానీ కోహ్లీ 124 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఓడిపోవాల్సి వ‌చ్చింది.

న్యూజిలాండ్ కు ప్రాణం పోసిన డారిల్ మిచెల్‌, ఫిలిప్స్‌

అంతకుముందు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రమాదకరంగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ అలాగే గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు కూడా భయంకరమైన సెంచరీలు నమోదు చేశారు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 131 బంతుల్లో 137 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో మూడు సిక్సర్లతో పాటు 15 బౌండరీలు ఉన్నాయి. అటు గ్లెన్ ఫిలిప్స్ 88 బంతుల్లో 106 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది బౌండరీలు అలాగే మూడు సిక్సర్లు ఉన్నాయి. దీంతో నిర్నిత 50 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్, 337 పరుగులు సాధించింది. ఇక ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో టీమిండియా అట్ట‌ర్ ఫ్లాఫ్ అయింది. దీంతో సిరీస్ కోల్పోయింది.

Advertisement

Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైన‌ల్..ఇక మ‌నోళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×