BigTV English

Nani : నాని, సుజిత్ స్క్రిప్ట్ లాక్ అయిపోయింది, షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

Nani : నాని, సుజిత్ స్క్రిప్ట్ లాక్ అయిపోయింది, షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

Nani : అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన నాని, ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ లో ఒకరు. ప్రస్తుత కాలంలో నాని వరుస సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. ఒకవైపు హీరోగా మంచి సినిమాలు చేయడమే కాకుండా, మరోవైపు మంచి సినిమాలను ప్రొడ్యూస్ చేసే నిర్మాతగా మారాడు.


రీసెంట్ టైమ్స్ లో నాని నుంచి ఒక సినిమా వస్తుంది అంటే, అందరికీ ఒక రకమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను కూడా సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతాడు నాని. ఒక క్లాస్ ఫిలిం చేస్తే, మరుక్షణం ఒక యాక్షన్ ఫిలిం చేస్తాడు, అలానే వైలెంట్ ఫిలిం కూడా చేస్తాడు. నాని స్క్రిప్ట్ సెలక్షన్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

స్క్రిప్ట్ లాక్ అయిపోయింది 


సుజిత్ దర్శకత్వంలో నాని సినిమా చేస్తాడు అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక తరుణంలో ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ సినిమా పైన ఇప్పుడిప్పుడే చాలామందికి క్లారిటీ వస్తుంది. సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ అయిపోయింది. దీనిని బ్లడీ రొమిఒ అనే పేరుతో అప్పట్లో అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 2026 నుంచి మొదలుకానుంది. సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా విడుదల తర్వాత, ఈ స్క్రిప్ట్ పైన అలానే నటించబోయే నటుల పైన సుజిత్ కాన్సన్ట్రేషన్ చేయనున్నాడు. ఓజి సినిమా తర్వాత సుజిత్ సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. నాని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు.

భారీ అంచనాల ఓజి 

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది. కానీ ఒక వైపు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా మారిపోవడం వలన ఈ సినిమాకు డేట్స్ ఇవ్వడం కుదరలేదు. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. రేపు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోయే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం సుజిత్ స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అవ్వడమే. ఒక అభిమాని ఇదివరకే తీసిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మరో అభిమాని ఏ స్థాయి హిట్ ఇస్తాడు అనేది ఎదురు చూడాలి. వేణు శ్రీరామ్ చేసిన వకీల్ సాబ్ కూడా ఫ్యాన్స్ ని కొంతవరకు సంతృప్తిపరిచింది. ఓజి వాటన్నిటిని మించి ఉంటుందని చాలా మంది అభిప్రాయం.

Also Read: Pawan Kalyan : ఓజి ఫైర్ స్ట్రోమ్ సెట్ , ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు దానయ్య మావా

 

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×