Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సాహో అంటే పాన్ ఇండియా సినిమా తీసిన తర్వాత సుజిత్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సాహో సినిమాకి ఊహించిన ఫలితం లభించలేదు. అయితే సుజిత్ పవన్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ చేయగానే సాహో సినిమాని విపరీతంగా లేపడం మొదలుపెట్టారు కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
సుజిత్ ను పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక రీమేక్ సినిమా చేయడానికి పిలిచారు. ఇప్పటివరకు సుజిత్ రీమేక్ సినిమా చేయలేదు. అయితే ఆ టైంలో మనసులో సుజిత్ ఒక విషయం అనుకున్నాడు. నీ దగ్గర కథ ఏమైనా ఉందా అని అడిగే అవకాశం ఇస్తే బాగున్ను అని, వాస్తవానికి పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత అదే జరిగింది. ఆ సినిమానే ఓజి.
ఓజి ఫైర్ స్ట్రోమ్ సెట్
ఓజి సినిమా పాట కోసం ఎప్పటినుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ పాట రేపు విడుదల కానుంది. రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతున్నట్లు డి వి ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తమన్ అంతా సెట్ చేసి ఆడియో ఫైల్ పంపించేసాడు. అయితే తమన్ చాట్ కూడా స్క్రీన్ షాట్ చేసి డి వి వి ఎంటర్టైన్మెంట్ పోస్ట్ చేసింది. ఫస్ట్ సింగిల్ మీద ఎప్పటినుంచో మంచి హైప్ ఉంది. ఈ బ్యానర్ దానిని ఇంకా పెంచుతుంది అని చెప్పాలి. అసలు ప్రమోషన్స్ అంటే వీళ్లను చూసి నేర్చుకోవాలి అనేది కొంతమంది అభిప్రాయం. ట్విట్టర్ లో చాలామంది నెటిజెన్స్ కు వీళ్లు తమదైన శైలిలో ఆన్సర్స్ చెప్తారు. ఆన్సర్స్ క్రేజీగా ఉండటం వలన ఆ ట్వీట్లు ఇంకా వైరల్ గా మారుతాయి.
All set for the #FireStorm Tomorrow…..#OG #TheyCallHimOG pic.twitter.com/CSNUaaqyuy
— DVV Entertainment (@DVVMovies) August 1, 2025
శింబు పాడిన పాట
శింబు టాలెంట్ గురించి ప్రత్యాకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా అతని పరిచయం. నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ లో విడుదలయ్యాయి. తెలుగులో ఇదివరకే చాలా పాటలు పాడాడు శింబు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓ జి సినిమాలో పాట కూడా తనే పాడాడు. ఈ విషయాన్ని ఒక ప్రాంక్ కాల్ లో తమన్ రివీల్ చేశాడు. మొత్తానికి రేపు ఈ పవర్ ఫుల్ తుఫాన్ మొదలుకానున్నట్లు అధికారిక అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది.
Also Read: Anil Ravipudi: ఎంటర్టైన్మెంట్ కాకుండా సోషల్ ఎలిమెంట్ తో సినిమా చేశా అందుకే ఈ గుర్తింపు