IND VS ENG, 5Th Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఒక సెషన్ లో టీమిండియా విజృంభిస్తుంటే… మరో సెషన్ లో… ఇంగ్లాండ్ రెచ్చిపోతుంది. ఇలాంటి నేపథ్యంలోనే మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్ల ధాటికి.. ఇంగ్లాండ్ తక్కువ పరుగులకే కుప్పకూలింది. 51.2 ఓవర్స ఆడిన ఇంగ్లాండ్ టీం… 247 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. మహమ్మద్ సిరాజ్ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో… తక్కువ పరుగులకే కుప్పకూలింది ఇంగ్లాండ్ టీం. టీమిండియా అంతకంటే ముందు మొదటి ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: Woakes : ఇంగ్లాండ్ కు బిగ్ షాక్… మ్యాచ్ మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయిన డేంజర్ ఆటగాడు !
నాలుగు వికెట్లు తీసి రెచ్చిపోయిన మహమ్మద్ సిరాజ్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న లండన్ టెస్ట్ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 16.2 ఓవర్లు వేసిన మహమ్మద్ సిరాజ్… 86 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్ పడగొట్టాడు. ఇందులో కీలకమైన బ్యాటరీలు కూడా ఉన్నారు. ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ పోప్, అలాగే జో రూట్ వికెట్లను త్వర త్వరగా నే పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్. ఆ తర్వాత హరి బ్రూక్ ను క్లీన్ బోల్డ్ చేశాడు మహమ్మద్ సిరాజ్. బేతేల్ వికెట్ను కూడా మహమ్మద్ సిరాజే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో.. ఇంగ్లాండ్ టీం 247 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
మహమ్మద్ సిరాజ్ తో పాటు ప్రసిద్ కృష్ణ కూడా రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. అతను కూడా ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించాడు. అతడు మ్యాచ్ ఆడడం దండగ అని చాలామంది ట్రోలింగ్ చేశారు. కానీ ఐదవ టెస్టులో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరిచాడు ప్రసిద్ కృష్ణ. ఈ మ్యాచ్ లో 16 ఓవర్లు వేసి కేవలం 62 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్తి పడగొట్టి రాణించాడు. ఫీలింగ్ చేసే సమయంలో వోక్స్ కు గాయం కావడంతో అతడు బ్యాటింగ్ చేయలేదు.
Also Read: Ind vs Eng 5th Test: లండన్ టెస్ట్ లో కుప్పకూలిన టీమిండియా.. మొదటి ఇన్నింగ్స్ స్కోర్ ఎంత అంటే!
రెండో ఇన్నింగ్స్ లో దీటుగా ఆడుతున్న టీమిండియా
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ కావడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే… యశస్వి జైస్వాల్ kl రాహుల్ ఓపెనింగ్ చేశారు. కానీ ఏడు పరుగులు చేసిన తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. అటు యశస్వి జైస్వాల్ 40 కి పైగా పరుగులు చేసి… అద్భుతంగా ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ అవుట్ కావడంతో సాయి సుదర్శన్ బ్యాటింగ్ కు వచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 13 ఓవర్లు ఆడి… 55 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.