E-Paper
Advertisement

NTRNeel : ఆరు నెలల గ్యాప్ తర్వాత రంగంలోకి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్

NTRNeel : ఆరు నెలల గ్యాప్ తర్వాత రంగంలోకి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్
Advertisement

NTRNeel : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా డ్రాగన్. అయితే ఈ సినిమా పేరు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యంగా ఒక జపాన్ ఇంటర్వ్యూలో తన సినిమాలకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఎస్.ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ చెప్పేశారు. మీరు ఎక్కువగా ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అని అడిగినప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు. అప్పటికే ఇదే టైటిల్ అనుకుంటున్నారు అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. రాజమౌళి ఆ మాట చెప్పడంతో దాదాపు అందరూ అదే టైటిల్ ఫిక్స్ అయిపోయారు.

ఈ సినిమా గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఒక తరుణంలో ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర 2 సినిమా కూడా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. డ్రాగన్ చిత్ర యూనిట్ 6 నెలల గ్యాప్ తర్వాత షూటింగుకు వెళ్తున్నారు.

6 నెలల గ్యాప్ తర్వాత

Advertisement

ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బరువు చాలా తగ్గిపోయారు. కొంతవరకు బరువు తగ్గితే బాగుంటుంది కానీ తగ్గాల్సిన దానికంటే కూడా పూర్తిగా తగ్గిపోతే రోగిలా కనిపిస్తారు.

ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కు అదే జరిగింది. అయితే దానికి సంబంధించి చాలా కామెంట్స్ కూడా వినిపిస్తూ వచ్చాయి. మొత్తానికి ఆరు నెలలు ఈ సినిమాకి సంబంధించి అసలు షూటింగ్ జరగలేదు. ఇప్పుడు చిత్ర యూనిట్ మళ్లీ రంగంలోకి దిగి షూటింగ్ మొదలు పెడుతుంది. ఈ ఆరు నెలల గ్యాప్ లో మరో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో పడిపోయాడు ప్రశాంత్.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ 

Advertisement

మొత్తానికి ఇప్పటివరకు వస్తున్న వార్తలన్నిటికీ సంబంధించి చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. అయితే ఈ షూటింగ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తుంది. అలానే కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమా కూడా వస్తుంది.

వీటన్నిటిని మించి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మైథాలజికల్ సబ్జెక్ట్ చేయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు తర్వాత ఎన్టీఆర్ రేంజ్ కంప్లీట్ గా మారిపోతుంది అని అందరికీ ఒక అవగాహన ఉంది. ఆ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిపోయిన తర్వాత మొదలవుతుంది. ఏదేమైనా ప్రశాంత్ ప్రాజెక్టు పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వరుస మూడు డిజాస్టర్లు పడిన ప్రభాస్ కు సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు వార్ సినిమాతో డిజాస్టర్ లో ఉన్న తారక్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందా? అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.

Also Read: Bigg Boss 9 Telugu : ఇమ్మానుయేల్ కాళ్లకు గాయం, హుటాహుటిన మెడికల్ రూమ్ కి తరలింపు

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×