E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఇమ్మానుయేల్ కాళ్లకు గాయం, హుటాహుటిన మెడికల్ రూమ్ కి తరలింపు

Bigg Boss 9 Telugu : ఇమ్మానుయేల్ కాళ్లకు గాయం, హుటాహుటిన మెడికల్ రూమ్ కి తరలింపు
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. అయితే హౌస్ లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అని అడిగితే పదిలో 8 మంది ఖచ్చితంగా చెప్పే పేరు ఇమ్మానుయేల్. ఆ తర్వాత సుమన్ శెట్టి పేరు కూడా కొంతకాలం వరకు వినిపించింది. కానీ ఈ మధ్యకాలంలో సుమన్ శెట్టి పేరు వినిపించడం లేదు. ఎందుకంటే చాలామంది కంటెస్టెంట్స్ వాళ్ళు తమకు తాముగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో మనుషుల మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది.

ఇమ్మానియేల్ కాళ్లకు గాయం

హౌస్ లో టాస్కులు పెట్టడం అనేది కామన్ గా జరుగుతుంది. ఈ క్రమంలో హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ కోసం పోటీలు జరుగుతున్నాయి. తాజాగా మరో ప్రోమోను వదిలారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఇమ్మూ, తనూజ బాల్స్ గేమ్ ఆడారు. అయితే ఈ ఆటలో ఇమ్మూ కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక గేమ్ కాసేపు ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్ రూమ్కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్ లోనే తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయింది.

ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నారు?

Advertisement

ఏదేమైనా సరే కొన్ని విషయాలను సీరియస్ గా తీసుకోవడం అవసరమే. కానీ ఈ రియాలిటీ షోను విపరీతమైన సీరియస్గా తీసుకుంటున్నారు అని మనుషులు భావోద్వేగాలు చూస్తుంటే అర్థమైపోతుంది. మరి శరీరాన్ని పూర్తిస్థాయిలో పణంగా పెట్టి గేమ్లు ఆడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే జరగకూడనిది ఏదైనా జరిగితే చాలా సంవత్సరాలు పాటు ఆలోచించాల్సి వస్తుంది.

ఇలా జరగడం అనేది మొదటిసారి కాదు తమిళ్ ఇండస్ట్రీలో ఇంతకంటే దారుణంగా టాస్కుల కోసం పోటీపడిన వాళ్లు ఉన్నారు. ఇక తెలుగు హౌస్ లో భరణి కూడా దారుణమైన సిచువేషన్ ఫేస్ చేశాడు. ఆల్మోస్ట్ హౌస్ నుంచి బయటికి పంపించి హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయోష అయితే ఉన్నపలంగా మధ్యలో బయటకు వెళ్ళిపోయింది. అందుకే కొన్ని గేమ్స్ విషయంలో మరి సీరియస్ గా తీసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా ఆడితే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం.

Advertisement

ఏదేమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ షో గురించి విపరీతమైన కామెంట్స్ వినిపిస్తూ వస్తుంది. కొంతమంది ఇమ్మానుయేల్, తనుజ ను కేవలం టిఆర్పి రేటింగ్ కోసం వాడుకుంటున్నారు అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాలను విన్నర్ చేసే ఆలోచనలో ఉన్నారు అని విపరీతంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Also Read: HBD Rajinikanth : రజినీకాంత్ అంటే స్వాగ్ స్టైలే కాదు, అవార్డులు ఆలయాలు కూడా 

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×