E-Paper
Advertisement

Minister Komatireddy: హీరోలకు వందల కోట్ల రెమ్యురేషన్లు ఎందుకు?.. ఇకపై టికెట్ల రేట్ల పెంపు ఉండదు: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy: హీరోలకు వందల కోట్ల రెమ్యురేషన్లు ఎందుకు?.. ఇకపై టికెట్ల రేట్ల పెంపు ఉండదు: మంత్రి కోమటిరెడ్డి
Advertisement

Minister Komatireddy: అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని స్పష్టం చేశారు. నిర్మాతలు, దర్శకులెవరూ టికెట్ల రేట్లు పెంచమని తమ దగ్గరకు రావొద్దన్నారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారని మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలుండాలన్నారు. టికెట్‌ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామన్నారు. ఈసారి పొరపాటు జరిగిందని చెప్పుకొచ్చారు.

పొరపాటున రేట్లు పెంపునకు అనుమతి

అఖండ2 సినిమా టికెట్ ధరల పెంపు నాకు తెలియకుండా జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.ఇకముందు ఎలాంటి సినిమాలకు టికెట్ ధరలు పెంచేది లేదన్నారు. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు తనకు తెలియకుండా పొరపాటున టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారన్నారు. తాను గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో బిజీగా ఉన్నానని, ఈసారి తన శాఖ అధికారులు పొరపాటున పెంచేశారన్నారు. సినిమా అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చూసేది, ఇష్టమున్నట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా? ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీ వ్యక్తులు ఎవరూ టికెట్ ధరలు పెంచమని తనను అడగకండని సూచించారు.

Advertisement

Also Read: NTRNeel : ఆరు నెలల గ్యాప్ తర్వాత రంగంలోకి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్ 

అఖండ2 టికెట్ల రేట్ల పెంపు వివాదం

తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు మరోసారి వివాదాస్పదం అయింది. హీరో బాలకృష్ణ నటించిన అఖండ2 సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ ఓ న్యాయవాది కోర్టుకెక్కారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వంపై సీరియస్‌ అయింది. రేట్ల పెంపు జీవోను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో స్పందిస్తూ ఇకపై సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×