E-Paper
Advertisement

Kayadu Lohar : లవ్ లో పడ్డ కాయదు.. ఇదేం ట్విస్ట్.. పెళ్లి అప్పుడేనా..?

Kayadu Lohar : లవ్ లో పడ్డ కాయదు.. ఇదేం ట్విస్ట్.. పెళ్లి అప్పుడేనా..?
Advertisement

Kayadu Lohar : కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ముద్దుగుమ్మ కాయదు లోహార్. అక్కడ వరుసగా చిత్రాలతో ఫేమస్ అయినా ఈమె ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. డ్రాగన్ మూవీ తో యూత్ క్రషి గా మారిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా విశ్వక్ సేన్ నటించిన ఫంకీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటలేక పోయింది. అయినా కూడా ఈమె జోరు మామూలుగా లేదు.. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నట్లు ఆమె గతంలో బయట పెట్టిన విషయం తెలిసిందే. మరి ఈ ముద్దుగుమ్మ లవ్ లో ఉందేమో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

కాయదు ప్రేమలో పడిందా..?

ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిన ముద్దుగుమ్మ కాయదు లోహర్.. ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నట్లు బయటపెట్టింది. లోహర్‌ ప్రేమలో ఉందా, ఎవరితో అయినా రిలేషన్‌లో ఉందా అంటూ ప్రశ్నించింది. అప్పుడు కయాదు గట్టిగా నవ్వుతూ ప్రస్తుతానికి నేను వర్క్ తో మాత్రమే బిజీగా ఉన్నాను.. చిన్నప్పటి నుంచి పెద్దగా ప్రపోజల్స్ రాలేదు.. ఎందుకో తెలియదు. ప్రజెంట్ అయితే నేను సింగిల్ గానే ఉన్నాను. పెళ్లి మాత్రం చేసుకోవాలని ఉంది అని ఆమె అంటుంది.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి రష్మిక లాగా సడెన్గా గా పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి..

Advertisement

Also Read : ‘వారసురాలు ‘ మైథిలి రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ఇదేం ట్విస్ట్ పాప..

సినిమాల విషయానికొస్తే.. 

డ్రాగన్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈమె మూవీ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా హీరోయిన్ అయ్యింది. నిజానికి ఈమె కన్నడ మూవీ ముగిల్‌పేటతో 2021లో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కానీ ఆమె డ్రాగన్ తో యూత్ క్రష్ గా మారిపోయింది.. అర డజనుకు పైగా సినిమాలు సైన్‌ చేసిందట. వాటిల్లో ఈ ఏడాది కనీసం నాలుగు అయిదు అయినా విడుదల అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఆమెకు పెద్దగా సక్సెస్ ను ఇవ్వలేక పోయిన కూడా ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగులోనూ స్టార్‌ హీరోలకు జోడీగా ఈమె నటించే అవకాశాలు ఉన్నాయి. కయాదు లోహర్‌ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం ఉండబోతుంది. ఒక్క మూవీ హిట్ అయితే చాలు మళ్ళీ హిట్ ట్రాక్ కంటిన్యూ అవుతుంది. దాంతో ఇప్పటిలో పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం అయితే లేదని తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే…

Related News

హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!

ఒకే సినిమాలో 12 పాత్రలు.. కమల్ హాసన్‌ను మించిపోయిన ప్రియాంక చోప్రా!

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

Big Stories

Advertisement
×