Meenaakshi Chaudhary : టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల జోరుని కాస్త తగ్గించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు నటించిన ప్రతి సినిమా కూడా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోలో సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ అమ్మడు తనకు కాబోయే వరుడుకు ఉండవలసిన క్వాలిటీస్ గురించి బయటపెట్టింది.. ఆమె ప్లానింగ్ వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే.. ఫ్యూచర్ లో వెనక్కి చూసుకోకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంది. మరి మీనాక్షి చౌదరికి కాబోయే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.. అయితే అందులో ముందుగా తన సినిమాల గురించి వివరించిన ఆమె.. తన కెరియర్ ఎలా ఉండాలన్న విషయాన్ని కూడా బయటపెట్టింది.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అన్న విషయం గురించి ఆమె పెద్ద లిస్టే చెప్పారు.. తనకు కాబోయే భర్తకు 100 ఎకరాలు ఆస్తి ఉండాలని ఆమె ఒక్కసారిగా చెప్పేసింది. అంతే కాదండోయ్.. అతనికి బట్టలు ఉతకడం రావాలి. అలాగే వంట చేయడం కూడా రావాలి అని కండిషన్స్ కూడా ఉన్నట్లు చెప్పింది.. మొత్తానికి ఇంట్లో పనులన్నీ వచ్చేలా ఉండాలి అని ఆమె చెప్పకనే చెప్పేసింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో మీనాక్షి పెద్ద ప్లానింగ్ లోనే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read :ఓటీటీలోకి విశ్వక్ ‘ఫంకీ’.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..!
తెలుగులో హిట్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన కొలై చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆర్ జే.బాలాజి సరసన సింగపూర్ సెలూన్, గోట్ మూవీలల్లో నటించింది.. దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించిన లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత తెలుగులో మహేష్‌బాబుతో కలసి గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించింది.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇక తర్వాత రీసెంట్ గా అనగనగా ఒక రాజు సినిమాలో నటించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మరో హిట్ ట్రాక్ ఆమె సొంతమైంది.. ప్రస్తుతం తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.. చేసిన సినిమాలు అన్నీ కూడా ఆమెకు మంచి హిట్ ట్రాక్ ని సొంతం చేసుకునేలా చేశాయి. మరి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తుందో చూడాలి..