E-Paper
Advertisement

NTR Bengaluru: బెంగళూరులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా.. ఆ నినాదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

NTR Bengaluru: బెంగళూరులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా.. ఆ నినాదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..
Advertisement

NTR Bengaluru: టాలీవుడ్ గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి పక్క రాష్ట్రాల్లోనూ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది. ఆదివారం బెంగళూరులో జరిగిన ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్‌ను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో బెంగళూరు వీధులు జనసంద్రమయ్యాయి.

Read also-Funky OTT : ఓటీటీలోకి విశ్వక్ ‘ఫంకీ’.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..!

Advertisement

‘సీఎం… సీఎం’ నినాదాలతో..

తారక్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు తెల్లవారుజాము నుంచే ఆస్పత్రి పరిసరాలకు చేరుకున్నారు. ఎన్టీఆర్ వేదికపైకి రాగానే వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా “సీఎం… సీఎం ఎన్టీఆర్” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేవలం తెలుగు వారే కాకుండా, స్థానిక కన్నడ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.

Advertisement

Read also-Horror movie OTT: మనుషుల్ని బతికుండగానే తినే ఊరు… గుండెలు జారిపోయే సీన్లు

రోడ్లు బ్లాక్ – రంగంలోకి పోలీసులు

అభిమానుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో మహాదేవపుర, ఎలక్ట్రానిక్ సిటీ వైపు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన బెంగళూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, భారీ కేడెట్లను ఏర్పాటు చేసి అభిమానులను నియంత్రించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న తన తదుపరి చిత్రం పనులలో కూడా బిజీగా ఉన్నారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×