E-Paper
Advertisement

Funky OTT : ఓటీటీలోకి విశ్వక్ ‘ఫంకీ’.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..!

Funky OTT : ఓటీటీలోకి విశ్వక్ ‘ఫంకీ’.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..!
Advertisement

Funky OTT : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ఫంకీ.. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. రిలీజ్ కి ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఆ తర్వాత పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించగా డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్ హీరోయిన్ గా నటించింది.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ నిర్మాణంలో ఎస్‌.నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. నరేష్, ఈశ్వరీ రావు, సంపత్ రాజ్, జై కృష్ణ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని థియేటర్లలో మిస్ అయినవారికి చిత్రయూనిట్ గుడ్ న్యూస్ చెప్పేసింది. తాజాగా ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది.. మరి ఎప్పుడు ఎక్కడ? అవుతుంది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

‘ఫంకీ ‘ ఓటీటీ డీటైల్స్.. 

టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ మొదటి నుంచి విభిన్న స్టోరీలతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నాడు.. అయితే ఈమధ్య ఈ హీరోకి సరైన హిట్ సినిమా పడలేదు. గతంలో వచ్చిన లైలా మూవీ నిన్న వచ్చిన ఫంకీ మూవీ రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. థియేటర్లో పెద్దగా ఆడని ఫంకీ ఓటీటీలో చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏ సినిమా అయినా రిలీజ్ అయినా నెల తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి వచ్చేస్తుంది.. ఏ మూవీ కూడా ఈ నెల 13న స్ట్రీమింగ్ కానుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.. ప్రస్తుతానికి తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు 10 కోట్లు మాత్రమే వసూల్ అయ్యాయి.. దాంతో సినిమా బోల్తా కొట్టింది.

Advertisement

Also Read :జ్వరంతో ఇబ్బంది పడుతున్న రాశి.. డాక్టర్ ఎవరో తెలిస్తే అవాక్కవుతారు..!

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

విశ్వక్ సేన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఇప్పుడు మాస్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించే ఈ హీరో ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు.. ఇందులో కోమల్ అనే దర్శకుడు పాత్రలో నటించాడు. రూ. 4 కోట్ల బడ్జెట్‌లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్‌ హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు.. బడ్జెట్ పెరుగుతుంది తప్ప సినిమా మాత్రం పూర్తిగా కాకపోవడంతో నిర్మాత ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. ఆ తర్వాత నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు హీరోయిన్ కాయలు లోహర్ తీసుకుంటుంది. అప్పుడు వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. సినిమా పూర్తి అవుతుందా లేదా అన్నది తెలియాలంటే సినిమాని చూసేయాల్సిందే..

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×