E-Paper
Advertisement

Romantic comedy OTT: వైన్ కంపెనీకి ఊహించని షాక్ … అమ్మాయి ప్రేమలో గొర్రెల కాపరి … కిక్కెక్కించే క్రేజీ స్టోరీ

Romantic comedy OTT: వైన్ కంపెనీకి ఊహించని షాక్ … అమ్మాయి ప్రేమలో గొర్రెల కాపరి … కిక్కెక్కించే క్రేజీ స్టోరీ
Advertisement

Romantic comedy OTT : ఒక ఆసక్తికరమైన మంచి లవ్ స్టోరీ చూడాలనుకుంటే ఈ మూవీ ని చూసేయొచ్చు. సింపుల్ గా సరదాగా సాగిపో యే ఈ స్టోరీ మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు. ఒక అమ్మాయి, వైన్ కంపెనీ తో డీల్ పెట్టుకునే క్రమంలో ఈ స్టోరీ నడుస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగే ప్రేమ కథ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘A Perfect Pairing’. 2022లో వచ్చిన ఈ సినిమాకు స్టువర్ట్ మెక్‌డొనాల్డ్ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఒక . ఇందులో విక్టోరియా జస్టిస్, ఆడమ్ డెమోస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో షూట్ చేశారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హీరోయిన్ లోలా ఒక పెద్ద వైన్ కంపెనీలో బాగా కష్టపడుతుంటుంది. కానీ ఆమె ఐడియాని వేరేవాడు దొంగిలించి ప్రమోషన్ కొట్టేస్తాడు. దాంతో ఒళ్ళు మండిన లోలా, ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి తన సొంత కంపెనీ పెట్టాలని డిసైడ్ అవుతుంది. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక పెద్ద వైన్ కంపెనీ డీల్ కొట్టేస్తే తన లైఫ్ సెటిల్ అయిపోతుందని గట్టి నమ్మకంతో ఫ్లైట్ ఎక్కేస్తుంది. కానీ అక్కడ సీన్ కట్ చేస్తే, ఆ క్లయింట్ ఈమెను అస్సలు నమ్మదు. తన సత్తా నిరూపించుకోవడానికి ఆ క్లయింట్‌కు చెందిన గొర్రెల ఫామ్‌లో పనిమనిషిగా చేరుతుంది.

ఏసీ గదుల్లో తిరిగే లోలాకి గొర్రెల ఫామ్‌లో పని అంటే చుక్కలు కనిపిస్తాయి. అక్కడ ఆ ఫామ్ మేనేజర్ మాక్స్ దగ్గర పని నేర్చుకోవాల్సి వస్తుంది. మాక్స్ చూడటానికి గరుకుగా ఉన్నా, లోలా కష్టాన్ని చూసి మెల్లగా కరుగుతాడు. ఇద్దరి మధ్య చిన్నగా లవ్ ట్రాక్ మొదలవుతుంది. అయితే మాక్స్ ఒక మామూలు పనివాడు కాదు. ఆ క్లయింట్‌కు వరుసకు తమ్ముడు అవుతాడు. ఆ ఆస్తికి వారసుడు కూడా. కానీ ఆ విషయం లోలాకు చెప్పకుండా దాస్తాడు. లోలా కష్టాన్ని చూసి ఆ క్లయింట్ ఫిదా అయిపోయి డీల్ ఓకే చేస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో మాక్స్ అసలు విషయం లోలాకు తెలుస్తుంది. చివరికి లోలా అతని ప్రేమను అంగీకరిస్తుందా ? మోసం చేశావని వెళ్లిపోతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ప్రేమ పేరుతో బురిడి… భర్త హత్యకు ప్రియుడితో స్కెచ్… బుర్ర గిర్రున తిరిగే ట్విస్టులు

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×