Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్ లో మొత్తానికి 172 సినిమాలు పూర్తి చేసుకున్నారు. 173 వ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. అయితే ఆ సినిమా నుంచి సుందర్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతే తెలిసిందే. వార్తలు వస్తున్న తరుణంలోనే సుందర్ కమలహాసన్ రజనీకాంత్ కూడా చెప్పకుండా ఒక ప్రశ్నను రిలీజ్ చేశారు.
సుందర్ చెప్పిన ఐడియా మొదట్లో రజినీకాంత్ కి విపరీతంగా నచ్చింది. అయితే సుందర్ కేవలం పాయింట్ మాత్రమే చెప్పాడు. పూర్తి కథను దీనిపై సిద్ధం చేయు అని రజనీకాంత్ సుందర్ కి చెప్పారు. సుందర్ పూర్తి కథ తో మాత్రం, సూపర్ స్టార్ రజినీకాంత్ ని మెపించలేకపోయారు. అయితే ఆ సినిమా నుంచి సుందర్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ఎవరు దర్శకత్వం చేస్తారు అనే చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ధనుష్ గురించి ప్రత్యేకమైన పరిచయాల అవసరం లేదు కేవలం నటుడు గానే కాకుండా దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ధనుష్ కేవలం నటుడు గానే కాకుండా తన సినిమాలకు కూడా తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ధనుష్ చాలా రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఒక కథను చెప్పారు.
ఆ కథ సూపర్ స్టార్ రజినీకాంత్ కు విపరీతంగా నచ్చింది. ప్రస్తుతం ఆ కథను చేయడానికి కూడా రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. కానీ ధనుష్ కి ఉన్న కమిట్మెంట్స్ వలన ఇప్పటికిప్పుడు ఆ సినిమాను చేయలేడు. మరోవైపు తలైవర్ 173 సినిమాను త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. కేవలం టైం లిమిట్స్ వలనే ధనుష్ రజనీకాంత్ ని ఇప్పుడు దర్శకత్వం చేయలేకపోతున్నారు.
ధనుష్ కు ఏ కమిట్మెంట్స్ లేకపోతే వారిద్దరి కాంబినేషన్ చూడడానికి అవకాశం కలిగేది. అదే అనౌన్స్మెంట్ గాని వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
మరోవైపు సూపర్ సార్ రజనీకాంత్ పార్కింగ్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన రామ్ కుమార్ దర్శకత్వంలో తన 173 వ సినిమాను చేయబోతున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. 173 సినిమా నుంచి సుందర్ తప్పుకున్న తర్వాత చాలామంది దర్శకులు రజనీకాంత్ ని డైరెక్షన్ చేయబోతున్నారు అని వార్తలు వచ్చాయి.
అని ఇప్పటికీ కూడా ఆ సినిమాకి సంబంధించి ఒక డైరెక్టర్ ని కూడా ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాకి డైరెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Also Read : Anaganaga Oka Raju : అనగనగా ఒక రాజు ఫస్ట్ సింగిల్ వచ్చేసింది, సింగర్ గా అదరగొట్టిన జానే జిగర్