E-Paper
Advertisement

Health Tips: ఆలుగడ్డలను అతిగా తింటున్నారా.. కలిగే అనర్థాలు తెలిస్తే షాకవుతారు!

Health Tips: ఆలుగడ్డలను అతిగా తింటున్నారా.. కలిగే అనర్థాలు తెలిస్తే షాకవుతారు!
Advertisement

Health Tips: మనలో చాలామంది బంగాళదుంపలను చాలా ఇష్టంగా తింటుంటారు. ప్రతి కూరలోనూ ఏదొక రూపంలో ఆలూ ఉండాల్సిందే. కొందరు బంగాళదుంపల ప్రయోజనాలు తెలిసి వాడితే.. మరికొందరు అలవాటుగా వాడేస్తున్నారు. మన దేశంలో 120 కోట్ల మంది బంగాళదుంపల ప్రియులు ఉన్నారని ఓ సర్వేలో వెల్లడైంది. అయితే, బంగాళదుంపల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. వీటిని పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. మరి ఆలూను ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదు.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.

బరువు పెరిగే ప్రమాదం:

ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల బంగాళదుంపలో సుమారు 20.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.9 గ్రాముల ప్రొటీన్, 1.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా బంగాళదుంపలను తరచుగా తీసుకుంటే.. బరువు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఆలుగడ్డలను డీప్ ఫ్రై చేసి తినడం, చిప్స్ రూపంలో తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే.. వేయించిన ఆలూలో క్యాలరీలతో పాటు కొవ్వు శాతం, ట్రాన్స్ ఫ్యాట్ కూడా ఎక్కువే. ఫలితంగా త్వరగా బరువు పెరుగుతారు. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వాళ్లు బంగాళదుంపలు తినకపోవడమే మంచిది.

Advertisement

Read Also: మొలకెత్తిన దుంపలు తింటున్నారా?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!

ఎంత తీసుకుంటే మంచిది?

ఇకపోతే.. బంగాళదుంపలను డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు పూర్తిగా దూరం పెట్టాలి. ఆలూలో అధిక కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. కాబట్టి.. డయాబెటిస్ పేషెంట్లు డైటీషియన్ సూచనల మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. బంగాళదుంపలను అతిగా తినడం వలన ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు వేధిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణఉలు. ఈ క్రమంలో ఆలుగడ్డలను ఉడకబెట్టి లేదా ఆవిరిపై వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఎంత మంచిదైనా వీటిని రోజుకు 25-50 గ్రాములు మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×