E-Paper
Advertisement

Birthday Celebration: బర్త్ డే బంప్స్.. స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పటించి కేరింతలు కొట్టిన ఫ్రెండ్స్, చివరికి…

Birthday Celebration: బర్త్ డే బంప్స్.. స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పటించి కేరింతలు కొట్టిన ఫ్రెండ్స్, చివరికి…
Advertisement

కుర్రాళ్లలో పైత్యం రోజు రోజుకు మరింత ముదురుతుంది. బర్త్ డే పార్టీలతో చేసే పనులు హద్దులు దాటుతున్నాయి. బర్త్ డే బంప్స్ అంటూ అడ్డమైన పనులు చేస్తున్నారు. తాజాగా పుట్టిన రోజు పార్టీ చేస్తామని పిలిచి, బర్త్ డే బంప్స్ పేరుతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ముంబైలో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కుర్రాడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘనటకు సంబంధించి ఐదుగురు కుర్రాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మిత్రులు!

ముంబైలో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. కేక్ కట్ చేద్దామని పిలిచిన ఐదుగురు స్నేహితులు.. ముందుగా బాధితుడిపై కోడిగుడ్లు విసిరి, ఆపై స్కూటర్‌లోని పెట్రోల్‌ను పోసి, లైటర్ వెలిగించి నిప్పంటించారు. తీవ్రంగా మంటలు అంటుకోవడంతో అతడు భయంతో పరుగుతీశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నవంబర్ 24న ఈ ఘటన జరిగింది.

Advertisement

ఈ నెల 24న ఐదుగురు స్నేహితుల టీమ్ లో ఒకడైన అబుల్ రెహమాన్ బర్త్ డే. రాత్రి 8 గంటల సమయంలో అతడి స్నేహితులలో ఒకరైన అయాజ్ మాలిక్ కేక్ కట్ చేస్తామని చెప్పి పిలిచాడు. 21 ఏళ్ల అబుల్ వారి దగ్గరికి వచ్చాడు. ఆ తరువాత,  మరో స్నేహితుడు షరీఫ్ ఫోన్ చేసి అబుల్‌ను కోహినూర్ ఫేజ్ 3 సొసైటీలోని వింగ్ నంబర్ 26కి రమ్మని పిలుస్తాడు. అబుల్ కు రాగానే అయాజ్ మాలిక్, అష్రఫ్ మాలిక్, ఖాసిం చౌదరి, హుజైఫా ఖాన్, షరీఫ్ షేక్ కేక్ తీసుకొచ్చి వెల్ కం పలుకుతారు. అబుల్ కేక్ కట్ చేయగానే ఫ్రెండ్స్ తమ పైత్యాన్ని బయటపెట్టుకున్నారు. అందరూ అతడిపై రాళ్లు విసరడం ప్రారంభించారని బాధితుడు చెప్పాడు.

పెట్రోల్ పోసి నిప్పటించిన అయాజ్

అదే సమయంలో అయాజ్ పెట్రోల్ బాటిల్ తెచ్చి అష్రఫ్ తో కలిసి అబుల్‌పై పోచేశాడు. అబుల్ భయంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. మరో ముగ్గుర ఫ్రెండ్స్ అబుల్‌ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అబుల్ పారిపోవడానికి ప్రయత్నించగా, అయాజ్ మాలిక్ తన లైటర్‌తో అతడికి నిప్పు అంటిస్తాయి. క్షణాల్లో, అబుల్ బట్టలు కాలిపోయాయి, బాధితుడు పక్కనే ఉన్న బిల్డింగ్ వైపు పరిగెత్తాడు. అక్కడున్న సెక్యూరిటీ గార్డు నుండి వాటర్ బాటిల్ తీసుకొని తనపై పోసుకున్నాడు. కానీ మంటలు ఆరలేదు. ఆ తర్వాత దగ్గరున్న కుళాయి వద్దకు పరిగెత్తి, మంటలు ఆరిపోయే వరకు తనపై నీళ్లు పోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఫ్రెండ్స్ గుంపులో ఒకడైన హుజైఫా హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ఈ ఘనలో అబుల్ ముఖం, చెవులు, జుట్టు, ఛాతీ, రెండు చేతులు తీవ్రంగా కాలిపోయాయి. ఈ ఘటనపై  హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు స్నేహితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Read Also: చావును దగ్గర నుంచి చూశాడు.. అదృష్టమంటే ఇతడిదేగా!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×