E-Paper
Advertisement

Celebrity Parents 2025: ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సెలబ్రిటీస్ లిస్ట్!

Celebrity Parents 2025: ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సెలబ్రిటీస్ లిస్ట్!
Advertisement

Celebrity Parents 2025:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఏ వయసులో ఏ ముచ్చట జరగాలో.. ఆ ముచ్చట నిర్వహిస్తూ తమ కోరికలను నెరవేర్చుకోవడమే కాకుండా అభిమానులను కూడా సంతోషపరుస్తున్నారు. అలా ఈ ఏడాది కొంతమంది సెలబ్రిటీలు ప్రేమలో పడితే.. మరికొంతమంది పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి కొంతమంది తల్లిదండ్రులుగా కూడా ప్రమోషన్ పొందారు. అలా ఈ ఏడాది తల్లిదండ్రులుగా మారిన సెలబ్రిటీలు ఎవరు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ ఏడాది తల్లిదండ్రులుగా మారిన సెలబ్రిటీల జాబితా విషయానికి వస్తే.

1). లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ :

Advertisement

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 10న లావణ్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం అటు మెగా అభిమానులను , ఇటు మెగా ఫ్యామిలీని మరింత ఆనందపడేలా చేసింది. ఈ జంట తమ వారసుడికి వాయువ్ తేజ్ అని నామకరణం చేశారు.

2). కిరణ్ అబ్బవరం- రహస్య ఘోరక్ :

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించిన కిరణ్ అబ్బవరం నటించిన రాజావారు రాణిగారు సినిమాలో నటించిన హీరోయిన్ రహస్య ను 2024 ఆగస్టు 22న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2025 మే 22న మగ బిడ్డ జన్మించారు. ఇక తిరుపతిలో ఈ జంట తమ వారసుడికి హను అబ్బవరం అని నామకరణం చేశారు.

3). తిరువీర్- కల్పన:

మసూద చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించిన హీరో తిరువీర్ , కల్పన జంట 2025 డిసెంబర్ 12వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చారు.

4). కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా :

బాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించిన ఈ జంట 2025 జూలై 15న తల్లిదండ్రులయ్యారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది కియారా. ఈ జంట తమ వారసురాలికి సారాయాహ్ మల్హోత్రా అని నామకరణం చేశారు.

5). రాఘవ్ చద్దా – పరిణితి చోప్రా :

బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా పేరు సంపాదించిన పరిణితి చోప్రా, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా జంట 2025 అక్టోబర్ 19న మగ బిడ్డకు జన్మనిచ్చారు. వీరు తమ వారసుడికి నీర్ అని నామకరణం చేశారు.

6). కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ :

బాలీవుడ్ క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించిన వారిలో ఈ జంట కూడా ఒకటి. 2025 నవంబర్ 7వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చారు.

7). ఇలియానా – మైఖేల్

టాలీవుడ్ , బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఇలియానా.. తన రెండవ బిడ్డకి ఈ ఏడాది జూన్ లో జన్మనిచ్చారు.

8). అథియా శెట్టి – కేఎల్ రాహుల్:

బాలీవుడ్ నటి అథియా శెట్టి, భారత్ క్రికెటర్ కేఎల్ రాహుల్ 2023 జనవరిలో వివాహం చేసుకున్నారు. మార్చి 24, 2025 న పాప జన్మించింది.

9). ఆర్భాజ్ ఖాన్ – షురా ఖాన్ :

ఈ జంట 2023లో వివాహం చేసుకోగా , 2025 అక్టోబర్ 5వ తేదీన పాపకు జన్మనిచ్చారు.

10). శర్వానంద్ – రక్షితా రెడ్డి:

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించిన శర్వానంద్.. రక్షిత దంపతులకు ఈ ఏడాది పండంటి ఆడబిడ్డ జన్మించింది. కుమార్తెకు లీలాదేవి అని పేరు పెట్టారు.

వీరితోపాటు

11).రిహాన్నా – రాఖీ (అమ్మాయి – సెప్టెంబర్ 13)

12). క్రిస్ ఇవాన్స్ – అల్బా బాప్టిస్టా ( అమ్మాయి – అక్టోబర్ 25)

13). రెడిన్ కింగ్స్ లీ – సంగీత (అమ్మాయి – ఏప్రిల్ 2)

14). గౌహర్ ఖాన్ – జైద్ దర్బార్ (అబ్బాయి – సెప్టెంబర్ 1)

15). మాల్వికా రాజ్ – ప్రణవ్ బగ్లా (అమ్మాయి – ఆగస్టు 23)

16). రాజ్ కుమార్ రావు – పత్రలేఖ (అమ్మాయి – నవంబర్ 15)

ALSO READ:BMW: భర్త మహాశయులకు విజ్ఞప్తి బిజినెస్.. వర్కౌట్ అవ్వక ఆ పని చేస్తున్న రవితేజ

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×