మేడారం మహాజాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. జాతరలో భాగంగా భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ అని అన్నారు. ఈ సందర్భంగా సీతక్క.. గట్టమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మార్కాపురం జిల్లా ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత జిల్లా కల నెరవేరినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబుకు గుడి కడతామని
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటించారు.
AICC మహిళా కాంగ్రెస్ నేషనల్ సెక్రెటరీగా తెలంగాణకు చెందిన అదిత నియామకం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన సంస్థాగత పరిణామంలో భాగంగా ఈ నియామకం జరిగింది. AICC నేషనల్ జనరల్ సెక్రెటరీ KC వేణుగోపాల్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా ఆదేశాల మేరకు నియామకం జరిగింది.
కడపలో టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కొత్త జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, మంత్రి లోకేష్ కృషితో భారీ పెట్టుబడులు వస్తున్నాయని కొనియాడారు.
గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పోరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి చివరి వారంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఖమ్మం జిల్లా జీళ్ళచెరువులో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కోతికి గ్రామస్తులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో కోతి పార్థివ దేహాన్ని గ్రామం మొత్తం ఊరేగించి, జలాభిషేకం చేశారు. హనుమంతుని స్వరూపంగా భావించే వానరానికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికి, గ్రామస్తులంతా కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు.
యాసంగి సీజన్‌లో యూరియా కొరత లేకుండా వ్యవసాయ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రత్యేక అధికారులను ఫీల్డ్ లెవల్‌కు పంపి ఒక్కో అధికారికి ఐదు జిల్లాల బాధ్యతలను అప్పగించింది. క్యూ లైన్లు లేకుండా పంపిణీ సక్రమంగా జరిగేలా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అగ్రికల్చర్ డైరెక్టర్ బి. గోపి భరోసా ఇచ్చారు.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేధా కంపెనీ సమీపంలో ఆగి ఉన్న బైక్‌ను అతివేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కంపెనీ ఉద్యోగి ఈగ మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ రైల్వే పరిధిలో గతేడాది కంటే నేరాల సంఖ్య తగ్గిందని జీఆర్‌పీ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఈ ఏడాది 2 వేల 607 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సీసీ కెమెరాల్లో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా నేరగాళ్లను గుర్తిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇటీవల నవ దంపతులు గొడవ పడిన తరువాతే రైలు నుంచి దూకినట్లుగా తేలిందని వెల్లడించారు.
గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. గత మూడు రోజులుగా పసిడి ధరలు భారీగా పతనమవుతుండటంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ మూడు రోజుల వ్యవధిలోనే తులం బంగారంపై ఏకంగా 6,540 రూపాయల వరకు తగ్గింది.
సిద్దిపేట జిల్లాను పులి టెన్షన్ వదలడం లేదు. పులి సంచారంతో సిద్దిపేట ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన పులి.. సిద్దిపేట జిల్లాలో తిరుగుతుంది. పులి జాడ కోసం 6 స్పెషల్ టీంలు, 15 కెమెరాలు ఏర్పాటు చేశారు.
అన్నమయ్య జిల్లా పీలేరులో నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ఆర్డీవోగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించగా, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చొరవను ప్రజలు అభినందించారు. ఈ ఏర్పాటుతో స్థానికులకు పరిపాలన మరింత చేరువకానుంది.
భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. సుమారు 4 కోట్ల విలువైన 4కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి భువనేశ్వర్ వస్తున్న బిజు పట్నాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో వృద్ధురాలు సాంబలక్ష్మి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి మూడు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. రాత్రి సమయంలో ముసుగు ధరించి ఇంట్లోకి చొరబడిన దొంగ, ఆమె నిద్రిస్తుండగా ఈ చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై రచ్చ ఆగడం లేదు. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంపై రాయచోటి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి జిల్లా సాధన సమితితో పాటు.. స్థానిక ప్రజలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా రోడ్లపైకి వచ్చారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు డెన్మార్క్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు డిజిటల్ కమ్యూనికేషన్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తపాలా సేవలను ముగించిన తొలి దేశంగా డెన్మార్క్ నిలిచింది.
విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ఫైసల్ కరీమ్ మసూద్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ దుబాయ్ నుంచి అతడు ఓ వీడియోను విడుదల చేశాడు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని.. దీని నుంచి తనని తాను రక్షించుకునేందుకు దుబాయ్‌కు వెళ్లిపోయినట్లు తెలిపాడు.
గాలి కాలుష్యం, పొగ మంచు ఢిల్లీని వణికిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో 18 డిగ్రీల వద్ద చలి తీవ్రత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. విమానాలు, రైళ్లు, వాహనాల రాకపోకలపై పొగ మంచు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 455గా నమోదైంది.
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డామియన్ మార్టిన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మెనింజైటిస్ కారణంగా తీవ్ర అనార్యోగానికి గురైన అతడు.. ప్రస్తుతం క్వీన్స్‌లాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న మార్టిన్‌కు వైద్యులు మత్తు మందు ఇచ్చి.. తాత్కాలికంగా కోమాలోకి వెళ్లేలా చేశారు.
మామూలు అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ధురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న భారత్‌తో సహా.. యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో ఈ చిత్రం విడుదలైంది. కానీ, పశ్చిమాసియాలో మాత్రం దీనిపై నిషేధం విధించారు. దీంతో దాదాపు 90కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు విదేశీ పంపిణీదారు ప్రణబ్ కపాడియా చెప్పారు.