E-Paper
Advertisement

దళపతి విజయ్‌ని టార్గెట్ చేశారా? TN 2026’రిలీజ్ ముందే పెద్ద వివాదం!

దళపతి విజయ్‌ని టార్గెట్ చేశారా? TN 2026’రిలీజ్ ముందే పెద్ద వివాదం!
Advertisement

Thalapathy Vijay: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాట రాజకీయాలు మహా రంజుగా సాగుతున్నాయ్. ఇక ఈ ఎన్నికల్లో TVK పార్టీ పెట్టి  దళపతి విజయ్  ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే సరిగ్గా ఎన్నికలకు సరిగ్గా 13 రోజుల ముందు, అంటే ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న ‘TN 2026 (తంగ నచ్చత్తిరం)’ఇపుడు కోలీవుడ్ సర్కిల్స్ లో మంటలు పుట్టిస్తుంది.

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే కథాంశం చుట్టూ సినిమా

Advertisement

ఎందుకంటారా.. ఈ మూవీ ఒక సూపర్ స్టార్ హీరో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే కథాంశం చుట్టూ సినిమా తిరగడమే. అవును ఈ సినిమాలో హీరో నట్టి (నటరాజ్) పోషిస్తున్న’గోల్డెన్ స్టార్ గుల్కండ్ కుమార్’ పాత్ర అచ్చం తమ నాయకుడు దళపతిని విజయ్‌ని వెక్కిరిస్తున్నట్లే ఉందన్నది ,తెల్లటి షర్ట్, ఖాకీ ప్యాంట్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్.. పైగా విజయ్ సిగ్నేచర్ నడకను ఈ సినిమాలో స్పూఫ్ చేశారంటూ తెగ ఫైర్ అవుతున్నాయి TVK శ్రేణులు. 

also read:బాక్సాఫీస్ దగ్గర ఏప్రిల్ ‘ఏప్రిల్ ఫూల్’ చేస్తుందా? ఈ వారం సినిమాలపై పెరుగుతున్న అనుమానాలు!

Advertisement

బుస్సీ ఆనంద్‌ను పోలి ఉండేలా తంబి రామయ్య

ఇక ఇందులో కేవలం హీరోనే కాదు, విజయ్ వెన్నంటి ఉండే బుస్సీ ఆనంద్‌ను పోలి ఉండేలా తంబి రామయ్య క్యారెక్టర్‌ను డిజైన్ చేయడం విజయ్ ఫ్యాన్స్ కోపానికి మరింత కారణం అయింది. ఇక ఈ క్రమంలోనే  టీవీకే నేత ఆధవ్ అర్జున అయితే ఏకంగా ఇది “DMK-BJP మాస్టర్ ప్లాన్” అని బాంబు పేల్చారు కూడా .  విజయ్  నటించిన ఆఖరి సినిమా ‘జననాయకన్’ (Jananayagan) రిలీజ్  అవకుండా  సెన్సార్ బోర్డు అడ్డంకులు సృష్టిస్తూ, ఎన్నికల కమిషన్ రివ్యూ పేరుతో కాలయాపన చేస్తోందని,  సరిగ్గా అదే సమయంలో విజయ్‌ను కించపరిచేలా ఉందంటున్న ‘TN 2026’ కు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫ్యాన్స్ ఎలక్షన్ కమిషన్‌ను నిలదీస్తున్నారు దళపతి ఫ్యాన్స్. 

ఇది ఎవరినీ ఉద్దేశించింది కాదంటున్న మూవీ టీమ్ 

ఒకవైపు ఇలా ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే  చిత్ర యూనిట్ మాత్రం “ఇది ఎవరినీ ఉద్దేశించింది కాదు, జస్ట్ ఫన్ ఎంటర్టైనర్” అని కవర్ చేస్తున్నా, సినిమాలో డైలాగ్స్ మాత్రం పక్కాగా పొలిటికల్ సెటైర్లుగా ఉన్నాయని కోలీవుడ్ టాక్ .ఇక  విజయ్ పొలిటికల్ ఫ్యూచర్ ని  వెక్కిరించేలా ఈ సినిమా ఉందంటూ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి కూడా. ఇక Xలో #BoycottTN2026 మరియు #TNSaysNoToPropaganda వంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తుండగా, యాంటీ-ఫ్యాన్స్ మాత్రం “సినిమాను సినిమాగా చూడండి” అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

విజయ్‌పై సింపతీ పెంచుతుందా

ఏది ఏమైనా ఏప్రిల్ 10వ తేదీన  సినిమా రిలీజ్ అవుతుందా లేక సెన్సార్ కోతలకు గురయి బయటపడుతుందా లేక విజయ్ ఫ్యాన్స్ చెప్పినట్టుగా సినిమా అసలు రిలీజ్ కాకుండా ఆగిపోతుందా అన్నది  ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.ఒకవేళ ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అయితే, థియేటర్ల దగ్గర దళపతి ఫ్యాన్స్ రచ్చ గ్యారెంటీ అని ఇప్పటి నుండే అలర్ట్ అవుతున్నారట పోలీసులు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సంగతి పక్కన పెడితే, తమిళనాట ఓట్ల సమీకరణాలను ఈ సినిమా మార్చేస్తుందా లేక విజయ్‌పై సింపతీ పెంచుతుందా అన్నది చూడాలి

also read:బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్’ విధ్వంసం ! రణవీర్ సింగ్ రివెంజ్ కి ఇండియన్ సినిమా షేక్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×