E-Paper
Advertisement

Ambati Rayudu On RCB: ఒక్కదానికే టైటిల్ గెలిచినంత ఫీల్ అవుతున్నారు…ఈ ఓవ‌రాక్ష‌న్ త‌గించుకోండి

Ambati Rayudu On RCB: ఒక్కదానికే టైటిల్ గెలిచినంత ఫీల్ అవుతున్నారు…ఈ ఓవ‌రాక్ష‌న్ త‌గించుకోండి
Advertisement

Ambati Rayudu On RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ పై మొట్ట మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న బెంగుళూరు.. ఆదివారం చెన్నై సూప‌ర్ కింగ్స్ ను చిత్తు చేసింది. నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించిన బెంగుళూరు.. సెలబ్రేషన్స్ వివాదంగా మారాయి. అయితే దీనిపై మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ( Ambati Rayudu ) స్పందించారు. ఒక మ్యాచ్ విజయం సాధిస్తే టైటిల్ గెలిచినంత ఫీల్ అవుతున్నారు.. ఈ ఓవరాక్షన్ తగ్గించండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

ఒక్కదానికే టైటిల్ గెలిచినంత ఫీల్ అవుతున్నారు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా చెన్నై అభిమానులను ఉద్దేశించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఓవరాక్షన్ చేశారు. పక్క సీట్లలో కూర్చున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ర్యాగింగ్ చేస్తూ కనిపించారు. బౌండరీ అలాగే సిక్సర్లు వెళితే ఓ రేంజ్ లో ఆడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సపోర్ట్ గా నిలుస్తూ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఒక మ్యాచ్ గెలిచి 2026 టైటిల్ గెలిచినంత ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఒక్కసారి ఓడించి ఏదో సాధించినట్టు ఓవరాక్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలని చురకలు అంటించారు. గెలుపు ఎప్పుడు శాశ్వతం కాదని.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని మండిపడ్డారు. ఆటపరంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా రాణించిందని అదే సమయంలో ప్రశంసించారు. కానీ సెలబ్రేషన్స్ మాత్రం మరొకలని ఇబ్బంది పెట్టకూడదని కోరారు. స్పోర్ట్స్ అంటే యుద్ధం కాదని.. స్నేహపూర్వకంగా సెలబ్రేషన్స్ ఉండాలని అంబటి రాయుడు హితువు పలికారు.

చెన్నై సూపర్ కింగ్స్ ను ర్యాగింగ్ చేసిన జొమాటో

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం చెన్నై పై ఏకంగా 43 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. అయితే ఈ విజయం నేపథ్యంలో అర్ధరాత్రి జొమాటో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. చెన్నై సాంబార్ కంటే బెంగుళూరు సాంబార్ అద్భుతంగా ఉందని.. ఈ విజయాన్ని ఉద్దేశించి పోస్టు పెట్టింది. అయితే దీనిపై తమిళ నాడు రాష్ట్రానికి సంబంధించిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. వెంటనే జొమాటో ను బ్యాన్ చేయాలని కోరుతున్నారు.

 

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

 

https://www.facebook.com/photo/?fbid=122220632522289704&set=a.122097672758289704

Related News

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

Big Stories

Advertisement
×