BigTV English

Tollywood : వేశ్య పాత్రలో నటించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే.. రమ్యకృష్ణ నుంచి స్నేహ..

Tollywood : వేశ్య పాత్రలో నటించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే.. రమ్యకృష్ణ నుంచి స్నేహ..

Tollywood : సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఎటువంటి పాత్రలోనైనా నటించాలని కొందరు హీరోయిన్లు అనుకుంటారు. అందరు మాత్రం కేవలం హీరోయిన్ పాత్రలే చేయాలని అనుకుంటారు. ఈమధ్య ఎక్కువగా హీరోయిన్లు స్కోప్ ఉన్న పాత్రలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి పాత్రలలో ఒకటి వేశ్య పాత్ర.. ఇలాంటి క్యారెక్టర్ చేస్తే మళ్లీ హీరోయిన్గా ఛాన్స్ లు రావని కొందరు భయపడుతుంటారు. కానీ స్టార్ హీరోయిన్లు కొందరు వెనక్కి తగ్గకుండా ఏ పాత్రలోనైనా నటిస్తామంటున్నారు. అలాంటి వారిలో అలనాటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ నుంచి స్నేహ వరకు చాలామంది హీరోయిన్లు ఉన్నారు. మరి ఇప్పటివరకు ఏ హీరోయిన్ వేశ్య పాత్రలో నటించిందో ఒకసారి తెలుసుకుందాం..


వేశ్య పాత్రలో నటించిన హీరోయిన్లు.. 

రమ్య కృష్ణ.. 


రజినీకాంత్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ రమ్య కృష్ణ కూడా వేశ్య పాత్రలో అలరించింది. విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన పంచతంత్రం మూవీలో రమ్యకృష్ణ వేశ్య పాత్రలో నటించింది.. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రమ్యకృష్ణ నటనకు మంచి మార్కులు పడ్డాయి..

స్నేహ.. 

తెలుగు చిత్ర పరిశ్రమలు స్నేహ పేరు వినగానే పద్ధతికి కేరాఫ్ అని అందరూ అనుకుంటారు. ఇప్పటివరకు ఆమె ఎక్స్పోజింగ్ చేయకుండా సాదా సీదా అమ్మాయి పాత్రలోనే నటించింది అని అందరూ అనుకున్నారు. కానీ ఈమె కూడా వేశ్య పాత్రలో నటించింది. దూల్ ఫేట్ చిత్రంలో వేశ్యగా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

శ్రియ శరన్.. 

టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రియ శరన్ స్టార్ హీరోలతో వరసగా సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. ఈమె ఇప్పటివరకు స్టార్ హీరోలు అందరితో నటించిన సినిమాలు మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. అయితే పవిత్ర సినిమాలో ఈమె వేశ్య పాత్రలో నటించింది. ఆ పాత్రకు ఆమెకు మంచి మార్కులు పడ్డాయి.

అనుష్క.. 

టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె ఎన్నో హిట్ సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో ఈమె వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది..

ఛార్మి కౌర్.. 

సుందరకాండ, పౌర్ణమి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఛార్మి కెరియర్ పిక్స్ లో ఉండగానే వేశ్యపాత్రలో నటించింది.. జ్యోతిలక్ష్మి సినిమాలో ఈమె వేశ్యగా కనిపించింది. సినిమా స్టోరీస్ సరిగ్గా లేకపోవడంతో అంతగా గుర్తింపు రాలేదని తెలుస్తుంది.

Also Read: పారిపోయి పెళ్లి చేసుకున్న..అద్దెకు కట్టడానికి డబ్బులేక కష్టాలు..

వీళ్లే కాదు టబూ, అనసూయ, శృతిహాసన్, హన్సిక ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న చాలామంది హీరోయిన్లు వేశ్యపాత్రలో నటించారు.. అయితే వాళ్లంతా నటించిన సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీలో వాళ్ళ పేరు మరింత పెరిగింది. అంత పెద్ద హీరోయిన్ల అవి కూడా ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి అని కొందరు పెదవిరుస్తున్న సరే హీరోయిన్ లెక్కచేయకుండా సినిమాలు చేశారు. ప్రస్తుతం ఈ హీరోయిన్లందరూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు..

Related News

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Cine Workers Strike : సినీ కార్మికుల సమ్మెలో బిగ్ ట్విస్ట్… నోటీసులు జారీ చేసిన లేబర్ కమిషన్

Heroine: ఆ ఎమ్మెల్యే హోటల్‌కి రమ్మంటున్నాడు.. హీరోయిన్‌ సంచలన ఆరోపణలు

Andhra King Taluka: రిలీజ్ డేట్ ఫిక్స్, హే రామ్ ఒక్క హిట్ ప్లీజ్

Chiranjeevi: చిరంజీవి గొప్ప మనసు.. ఆ హీరో అప్పులు తీర్చేసిన మెగాస్టార్‌..

Prabhas: మహాభారతంలోని పాత్రతో ప్రభాస్ మూవీ… డార్లింగ్‌కు సరిగ్గా సెట్!

Big Stories

×