E-Paper
Advertisement

OTT Movie : మెషీన్ కోసం సొంత ఫ్రెండ్స్‌నే మర్డర్… ఇదెక్కడి సైకోరా అయ్యా

OTT Movie : మెషీన్ కోసం సొంత ఫ్రెండ్స్‌నే మర్డర్… ఇదెక్కడి సైకోరా అయ్యా
Advertisement

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు సినిమాలను చూస్తూ ఉంటారు. అయితే కొన్ని సినిమాలు సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తుంటాయి. ఎంటర్టైన్మెంట్ అటుంచి, టెన్షన్ తో గుండె దడను పెంచుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక ఆమ్మాయికి గిఫ్ట్ గా వచ్చిన ఒక  క్యాలెండర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అది ప్రాణాలను తీస్తూ, కోరికలను నెరవేరుస్తుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే .. 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ ఫ్రెంచ్-బెల్జియన్ హారర్-థ్రిల్లర్ మూవీపేరు ‘ది అడ్వెంట్ క్యాలెండర్’ (The Advent calendar). 2021లో విడుదలైన ఈ సినిమాకి పాట్రిక్ రిడ్‌మాంట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో యూజీనీ డెరౌండ్ (ఎవా), హానరైన్ మాగ్నియర్ (సోఫీ), క్లెమెంట్ ఒలివియరీ, జానిస్ అబ్రిఖ్ నటించారు. ఈ చిత్రం ఒక అతీంద్రియ అడ్వెంట్ క్యాలెండర్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం డిసెంబర్ 2021లో షడ్డర్‌లో స్ట్రీమింగ్ కోసం విడుదలైంది. 1 గంట 44 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 6.3/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

రౌసెల్ అనే యువతి ఒక కారు ప్రమాదంలో తన కాళ్లను కోల్పోయి, వీల్‌చైర్‌ కే పరిమితం అవుతుంది. రౌసెల్ ఇదివరకు బ్యాలెట్ డాన్సర్ గా ఉండేది. ఈ ప్రమాదం వల్ల ఆమె జీవితం తలకిందులైంది. ఇప్పుడు ఒంటరితనంతో బాధపడుతోంది.  ఆమె తండ్రి కూడా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుంటాడు. ఆమె సవతి తల్లి అగ్నెస్, ఆమెను తన తండ్రి నుండి దూరంగా ఉంచుతుంది. తాను చేసే ఉద్యోగంలో కూడా ఆమె బాస్ జాన్ అంటోనిచ్ అవమానిస్తాడు. ఇది ఇలా ఉంటే ఒకరోజు రౌసెల్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె స్నేహితురాలు సోఫీ బెర్లిన్ నుండి వస్తుంది. ఆమె మ్యూనిచ్ క్రిస్మస్ మార్కెట్ నుండి దొంగిలించిన, ఒక పురాతన చెక్క అడ్వెంట్ క్యాలెండర్‌ను ఆమెకు బహుమతిగా ఇస్తుంది.

ఈ క్యాలెండర్ సాధారణమైనది కాదు. దీనికి శక్తులు ఉంటాయి. మొదట్లో రౌసెల్ ఈ క్యాలెండర్‌ను తేలికగా తీసుకుంటుంది. మొదటి రోజు క్యాలెండర్‌ తో వచ్చిన ఒక చాక్లెట్‌ను తింటుంది. దీంతో క్యాలెండర్ లో ఉన్న అతీంద్రియ శక్తులు ఆమెలోకి ప్రవేశిస్తాయి. ఒక రోజు రౌసెల్ తన బాస్ జాన్ అంటోనిచ్‌ ను కోపంతో శపిస్తుంది. ఆ తరువాత క్యాలెండర్ శక్తి అతన్ని ఒక కుక్క దాడిలో హతమారుస్తుంది. మరొక రోజు ఆమె తన తండ్రికి ఇష్టమైన చాక్లెట్‌ను అందులో కనిపెడుతుంది. ఆమె దానిని తిన్న తర్వాత, ఆమె తండ్రి అల్జీమర్స్ నుండి కోలుకుంటాడు. అయితే ఆమె కోరికలు నెరవేరిన ప్రతిసారీ, ఎవరైనా చనిపోతుంటారు. రౌసెల్ కి దాని హింసాత్మక పరిణామాలు తెలిసినప్పటికీ, తన కాళ్లను తిరిగి పొందాలనే కోరికతో క్యాలెండర్‌ను కొనసాగించడానికి మక్కువ చూపిస్తుంది.

రౌసెల్ ఈ క్యాలెండర్ గత యజమాని, అలోయిస్ హాఫ్‌మాన్ అనే జర్మన్ చిత్రకారుడిని కలుస్తుంది. అతను గతంలో క్యాలెండర్ శాపానికి గురై గుడ్డివాడిగా మారి వుంటాడు. అతను దాని చరిత్ర గురించి ఆమెకు మొత్తం చెప్తాడు. దానికి దూరంగా ఉండమని సలహా ఇస్తాడు. ఇప్పుడు రౌసెల్ జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. ఆమె విలియమ్‌ అనే వ్యక్తి తో ప్రేమలో పడుతుంది. ఆమె ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఆమె కాళ్లలో చలనం తిరిగి వస్తుంది. అయితే ఇందుకు గానూ ఆ క్యాలెండర్, ఆమె సవతి తల్లి అగ్నెస్ ప్రాణాలను తీస్తుంది. ఈ క్రమంలో రౌసెల్ ఆ క్యాలెండర్ కు మరిన్ని ప్రాణాలు బలి ఇవ్వాల్సి వస్తుంది. ఇక క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. చివరికి రౌసెల్ ఆ క్యాలెండర్ మాయలో పడిపోతుందా ? ఆ క్యాలెండర్ అసలు చరిత్ర ఏంటి ? అది ఇంకెంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే .

Read Also : అమ్మాయి అనుకుని ఆంటీతో ఆ పని… ఆ సైకో పిల్ల ఇచ్చే ట్విస్టుకు వణికిపోయే ఫ్యామిలీ

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×