Jayalalitha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొందరికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వారి నటన, మంచితనం ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగేలా చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు తమ నటనతో ఆకట్టుకుంటున్న యాక్టర్స్ లలో జయలలిత ఒకరు. హీరోయిన్ మెటీరియల్ కానీ కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది. ఈమె ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును అందించాయి. ప్రస్తుతం సినిమాలే కాదు సీరియల్స్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. ఈమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని బయటపెట్టింది.. ఆమె పెళ్లి గురించి కీలక విషయాలను షేర్ చేసింది.
సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న..
నటి జయలలిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నన్ను ఇష్టపడే వాళ్ళే ఉన్నారు. మంచి అమ్మాయి. బాగా చేస్తుంది అని పొగిడేవారు. కానీ నేను ఓ వ్యక్తిని ప్రేమించాను. దాదాపు ఏడేళ్లు ప్రేమించాను. ఇంట్లో వాళ్లు ఒప్పుకోరేమో అని చెన్నైలోని ఓ గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు ఆయన నిజ స్వరూపం తెలియలేదు. పెళ్లి తర్వాత ఆ బాధలు అర్థమయ్యాయి. నన్ను కొట్టేవాడు. షూటింగ్ లకు వెళ్తే పరుచూరి గోపాల కృష్ణ నన్ను అరిచేవారు. వాడితో వద్దు అన్నాను ఎందుకు చేసుకున్నావు అని అన్నారు. ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు దేవుడు ఆయనే అని ఆమె అన్నారు. అతన్ని వదిలేసిన తర్వాత హ్యాపీగా ఉన్నాను అని ఆమె అన్నారు. జీవితంలో ఎంత త్వరగా ఏదిగానో, అంతే త్వరగా కింద పడ్డాను అని ఆమె తన జీవితంలోని కష్టాలను బయట పెట్టారు.
ఇంటికి అద్దె కట్టడానికి సాయం చేశాను..
ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి స్థానంలో ఉన్న వాళ్లు కూడా ఒక్కోసారి కిందకు పడిపోతున్నారు. నాకు తోచిన సాయాన్ని నేను చేశాను. ముఖ్యంగా ప్రశాంతికి చాలా సాయం చేశాను. ఇంటికి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఆమె ఉన్నారు. నేను 25 వేలు ఇచ్చాను. చిరంజీవి గారు కూడా సాయం చేశారు. అలా ప్రతి ఒక్కరిని నా సొంత వాళ్లు అనుకొనే దాన్ని అని ఆమె అన్నారు. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: తెలుగు హీరోలతో అందుకే సినిమాలు చెయ్యలేదు..ఇండస్ట్రీలో అదే కామన్..
జయలలిత సినిమాలు..
తెలుగు నటి జయలలిత గురించి అందరికి తెలిసే ఉంటుంది. తన నటనతో మాత్రమే కాదు. ఈమె ఒక డ్యాన్సర్ కూడా.. శృంగార, హాస్య పాత్రలను ఎక్కువగా పోషిస్తుంటుంది. జాతీయ పురస్కారం పొందిన గ్రహణం చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమ్మమ్మ డాట్ కామ్ అనే ధారావాహికలో కూడా నటించింది.. సినిమా లైఫ్ సాఫిగా సాగిపోతుంది. ఈ క్రమంలో ప్రేమించి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అదే ఆమె జీవితానికి శాపంగా మారింది. ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.