OTT Movie : ఓటీటీలోకి రకరకాల కంటెంట్ తో సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిలో కొన్ని స్టోరీలు చూడటానికి ఆసక్తిని పెంచుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సరోగసి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కామెడీ జానర్ లో వచ్చినా, ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. ఒక తల్లి, బిడ్డ బంధాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
జస్ట్ వాచ్ (justwatch) లో
ఈ బాలీవుడ్ కామెడీ మూవీ పేరు ‘దుకాన్’ (Dukaan). 2024లో విడుదలైన ఈ సినిమాకి సిద్ధార్థ్ సింగ్, గరిమా వాహల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మోనికా పన్వార్ (జాస్మిన్), సికందర్ ఖేర్ (సుమేర్), మోనాలి ఠాకూర్, సోహమ్ మజుందార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది గుజరాత్‌లో సరోగసీ చుట్టూ తిరిగే ఒక ఎమోషన్ స్టోరీ. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైంది. 2 గంటల 2 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి,IMDb లో 7.6/10 రేటింగ్ ఉంది. justwatch లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
కథ జాస్మిన్ పటేల్ అనే 25 ఏళ్ల యువతి గుజరాత్‌లో నివసిస్తుంటుంది. జాస్మిన్ తన తండ్రి పెట్టే శారీరక హింసతో కఠినమైన బాల్యాన్ని గడుపుతుంది. అందువల్ల ఆమెలో తిరుగుబాటు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆమె తన గతంలోని గాయాల కారణంగా పిల్లల పట్ల ద్వేషం పెంచుకుంటుంది. అయితే ఆమె జీవితం ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆమె సుమేర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అతనికి ఒక కుమార్తె కూడా ఉంటుంది. ఆ కుమార్తె జాస్మిన్ వయస్సుకు దగ్గరగా ఉంటుంది. ఈ వివాహం జాస్మిన్‌కు ఒక కొత్త బంధాన్ని ఇస్తుంది.
ఆ తరువాత ఆర్థిక పరిస్థితుల కారణంగా, జాస్మిన్ డబ్బుకోసం సరోగసీని ఎంచుకుంటుంది. డాక్టర్ నవ్య చందేల్ సలహాతో ఈ పని చేస్తుంది. ఇతర సరోగేట్ మహిళలతో కలిసి, ఒక సపోర్టివ్ సర్కిల్‌లో చేరుతుంది. ఆమె దియా, అర్మాన్ అనే ఒక జంట కోసం సరోగేట్ తల్లిగా ఒప్పందం చేసుకుంటుంది. వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం లేక పోవడంతో, ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే గర్భం దాల్చిన తర్వాత, జాస్మిన్ గర్భంలోని శిశువుతో ఒక బంధాన్ని పెంచుకుంటుంది. ఇది ఆమెను అయోమయంలో పడేస్తుంది. ఆమె ఈ శిశువును దియా, అర్మాన్‌లకు అప్పగించడానికి ఇష్టపడక, గర్భవతిగా ఉన్న సమయంలోనే పారిపోతుంది.
దియా, అర్మాన్ ఆమె పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. జాస్మిన్ నాలుగు సంవత్సరాల పాటు శిశువుతో పాటు అదృశ్యమవుతుంది. ఆమె చివరికి పట్టుబడి, జైలు శిక్ష అనుభవిస్తుంది. బిడ్డను దియా, అర్మాన్‌లకు పోలీసులు అప్పగిస్తారు. వాళ్ళు అతని పేరును దియమాన్‌గా మారుస్తారు. జాస్మిన్ జైలు నుండి విడుదలైన తర్వాత, తన బిడ్డను తిరిగి పొందడానికి న్యాయపరమైన పోరాటం చేస్తుంది. కానీ ఆమె వద్ద డబ్బు లేకపోవడంతో, ఎదురుదెబ్బలను ఎదుర్కొంటుంది. ఆరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. చివరికి జాస్మిన్ కి ఎటువంటి న్యాయం జరుగుతుంది ? ఇంతకీ ఆ బిడ్డ ఎవరికి చెందుతాడు ? జాస్మిన్ ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : భర్త ఉండగానే ఆఫీసులోనే కుర్రాడితో దుకాణం పెట్టే హీరోయిన్… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే