E-Paper
Advertisement

గాయపడ్డ సింహం గర్జించలేదు.. జెట్లీ స్పీడ్ అందుకోలేదు.. మే తొలివారం డిజాస్టర్?

గాయపడ్డ సింహం గర్జించలేదు.. జెట్లీ స్పీడ్ అందుకోలేదు.. మే తొలివారం డిజాస్టర్?
Advertisement

Box Office : మే డే సెలవును క్యాష్ చేసుకోవాలని చూసిన ‘కర’, ‘జెట్లీ’, ‘గాయపడ్డ సింహం’ సినిమాలకు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదని ఇన్‌సైడ్ టాక్. ముఖ్యంగా మే 1వ తేదీన కనీసం 50% ఆక్యుపెన్సీ ఉంటుందని అనుకున్న మేకర్స్‌కు మెజారిటీ ఖాళీ సీట్లు వెక్కిరించిన పరిస్థితి. ఇక చాలా చోట్ల సింగిల్  డిజిట్ ఓపెనింగ్స్ రావడం ట్రేడ్ వర్గాలకు పెద్ద షాకే.ప్రమోషన్లతో తెగ హడావిడి చేసిన ఈ సినిమాలు థియేటర్లలోకి అడుగుపెట్టాక “ఈ కంటెంట్ కోసమా ఇంత చేసింది?” అంటూ తలలు పట్టేసుకున్నారు ఆడియన్స్.

సాయంత్రం అయ్యేసరికి ఐపీఎల్ మ్యాచ్‌ల జోరులో

Advertisement

ఇక మే 2 (శనివారం)న వచ్చిన సాయి పల్లవి ‘ఏక్ దిన్’ తెలుగు వెర్షన్‌పై డిస్ట్రిబ్యూటర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ సాయి పల్లవికి ఉన్న సాలిడ్ క్రేజ్‌ను చూసి ఆడియన్స్ క్యూ కడతారని అనుకున్న ఎగ్జిబిటర్లకు సినిమా సినిమా చూపించేలా ఉంది. యస్… సాయంత్రం అయ్యేసరికి ఐపీఎల్ మ్యాచ్‌ల జోరులో ఈ సినిమా కొట్టుకుపోయేలా ఉందన్నది ట్రేడ్ వర్గాల రిపోర్ట్. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లలో కూడా ఆడియన్స్ ఈ సినిమాను పట్టించుకోకపోవడం విచిత్రం.

షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి

Advertisement

నైజాం మరియు సీడెడ్ ఏరియాల్లోని కొన్ని బీ, సీ సెంటర్లలో కనీసం పది మంది ప్రేక్షకులు కూడా లేకపోవడంతో షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఏసీ బిల్లులు, స్టాఫ్ జీతాలు కూడా రాని పక్షంలో హాల్ నడపడం కంటే మూసివేయడమే మేలని వాపోతున్నారు ఎగ్జిబిటర్లు.ఇక “ఒకప్పుడు సమ్మర్‌లో టిక్కెట్ల కోసం క్యూలు ఉండేవి, ఇప్పుడు ప్రేక్షకులను పిలిచి సినిమా చూపించాల్సి వస్తోంది” అంటూ బాధపడిపోతున్నారట థియేటర్ ఓనర్స్.మరో వైపు రెంటల్ VS పర్సెంటేజీ పంచాయితీ వల్ల కూడా సినిమాలు సరిగ్గా రిలీజ్ చేయని పరిస్థితి .

ALSO READ :హీరోయిన్ మోనాలిసా సంచలనం.. నాపై 10 సార్లు లైంగిక దాడి.. డైరెక్టర్‌పై పోక్సో కేసు!

ఇక ఈ వారం దెబ్బతో, మే నెల రెండో వారంలో విడుదల కావాల్సిన చిన్న చిత్రాల నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. కంటెంట్‌లో దమ్ము లేకపోతే రిలీజ్ రిస్క్ అని భావిస్తున్నారట.స్ట్రెయిట్ తెలుగు సినిమాలు లేకపోవడంతో ఇతర భాషల సినిమాలపై (ధనుష్, సాయి పల్లవి సినిమాలు ) ఆధారపడాల్సి వస్తోంది. కానీ అవి మన నేటివిటీకి సూట్ కాకపోవడంతో వాటిని  తిప్పి పంపే పనిలో పడ్డారు ఆడియన్స్

స్టార్ హీరోల మౌనం… ఇండస్ట్రీకి శాపం!

అయితే మే నెల సగం వరకు ఒక్క పెద్ద స్టార్ సినిమా కూడా లేకపోవడం బాక్సాఫీస్‌కు పెద్ద లోటే. షూటింగ్‌లు జరుపుకుంటున్న పెద్ద హీరోలు కనీసం సమ్మర్ సీజన్‌ను పట్టించుకోకపోవడం వల్ల జరగాల్సిన కోట్ల బిజినెస్‌కు బ్రేక్ పడిపోయింది. ఫలితంగా మే నెల ‘సమ్మర్ సీజన్’ కాస్తా ‘డ్రై సీజన్’గా మారుతున్న పరిస్థితి.

మొత్తంగా చూస్తే టాలీవుడ్ బాక్సాఫీస్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టే కనిపిస్తుంది. మరి మే నెల చివర్లో అయినా ఏదైనా మిరాకిల్ జరిగి కాసుల వర్షం కురుస్తుందా? లేక జూన్ 4న వచ్చే ‘పెద్ది’ మీదే భారం వేయాల్సి వస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి!

ALSO READ :గాయపడ్డ సింహం రివ్యూ…గాయపడ్డ సింహం గర్జించిందా లేదా?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×