E-Paper
Advertisement

Ahmed Shehzad: PSLలో రిటైర్మెంట్, పెన్ష‌న్ తీసుకునే ప్లేయ‌ర్లే ఉన్నారు..ప‌రువు తీసిన పాక్ ప్లేయ‌ర్‌

Ahmed Shehzad: PSLలో రిటైర్మెంట్, పెన్ష‌న్ తీసుకునే ప్లేయ‌ర్లే ఉన్నారు..ప‌రువు తీసిన పాక్ ప్లేయ‌ర్‌
Advertisement

Ahmed Shehzad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ( Pakistan Super League 2026) అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మార్చి 26వ తేదీన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుండగా, మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 షురూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు మెగా టోర్నమెంట్లకు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి రెండు కూడా పోటీపడి పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు పైన విషం కక్కుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షహజాద్ ( Ahmed Shehzad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ( IPL ) కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Psl ) చెత్త టోర్నమెంట్ అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో రిటైర్మెంట్, పెన్షన్ తీసుకునే ప్లేయర్లు ఉన్నారని బాంబు పేల్చాడు. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ త‌ర‌హాలో PSL టోర్నమెంటుకు పాపులారిటీ దక్కడం లేదని పరువు తీశాడు అహ్మద్ షహజాద్.

Also Read: Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు

PSLలో రిటైర్మెంట్, పెన్ష‌న్ తీసుకునే ప్లేయ‌ర్లే ఉన్నారు

Advertisement

ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లపై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షహజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అత్యున్నతమైనది అంటూ వ్యాఖ్యానించారు. ఈ టోర్నమెంట్ ని మించిన మరో లీగ్ లేదని తెలిపారు. ఐపీఎల్ ముందు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ దేనికి కూడా పనికిరాదని పరోక్షంగా చెప్పగానే చెప్పారు. అయితే ఐపీఎల్ ఇంత మెరుగ్గా ఉండడానికి ముఖ్య కారణం ఆ టోర్నమెంటులో పెద్ద స్టార్ క్రికెటర్లు ఉంటారని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షహజాద్. విదేశీ క్రికెటర్లతో పాటు స్వదేశంలో ఉండే బడా క్రికెటర్లు అందరూ ఐపీఎల్ ఆడతారని వివరించారు. దానివల్ల ఐపిఎల్ టోర్నమెంట్ కు ప్రపంచ స్థాయిలో ఆదరణ లభించిందని తెలిపారు.

అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో మాత్రం రిటైర్ అయిన ఆటగాళ్లు, పెన్షన్ తీసుకునే వాళ్ళు, కామెంటేట‌ర్లు ఉంటారని బాంబు పేల్చారు. వీళ్లందరినీ సూపర్ స్టార్స్ గా పాకిస్తాన్ సూపర్ లీగ్ తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు అహ్మద్ షహజాద్. అందుకే ఐపీఎల్ తో పోటీ పడలేక పోతుందని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ స్వరూపం వివరించారు అహ్మద్ షహజాద్. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షహజాద్ చేసిన వ్యాఖ్యలపై అక్కడి అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో అహ్మద్ షహజాద్ ను ఎవరు కొనుగోలు చేయలేదని.. అతనికి అవకాశాలు రాకపోవడంతో ఇలా విమర్శలు చేస్తున్నాడని మండిపడుతున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో అవకాశం వస్తే మరోలాగా అతడు వ్యవహరించేవాడని కౌంటర్ ఇస్తున్నారు.

Advertisement

Also Read: Taliban On PSL 2026: పాకిస్తాన్ స్టేడియాల్లో బాంబులు వేస్తాం…తాలిబ‌న్స్ హెచ్చ‌రిక‌లు, PSL 2026 ర‌ద్దు ?

 

Related News

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

Big Stories

Advertisement
×