E-Paper
Advertisement

iBELL Induction: తక్కువ ఖర్చుతో వేగంగా వంట చేయాలా ? iBELL ఇండక్షన్ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్

iBELL Induction: తక్కువ ఖర్చుతో వేగంగా వంట చేయాలా ? iBELL ఇండక్షన్ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్
Advertisement

iBELL Induction: iBELL ఇండక్షన్ ఇప్పుడు బడ్జెట్‌లో మంచి ఆప్షన్‌గా చాలా మందికి నచ్చుతోంది. తక్కువ ధర.. 2000W పవర్, సులభంగా వాడుకునే డిజైన్ తొ ఇది ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లా ఉంటుంది. చిన్న ఫ్యామిలీస్, స్టూడెంట్స్ కోసం ఇది చాలా హెల్ప్‌ఫుల్. దీనిని ఎక్కువ రోజులు వాడొచ్చా? తక్కువ ధరలోనే బెస్ట్ డీల్ ఆ ? ఈ రివ్యూలో iBELL కుక్‌ టాప్ గురించి పూర్తిగా సింపుల్‌గా ఇప్పడు తెలుసుకుందాం.

ఐబెల్ ఇండక్షన్ కుక్‌టాప్ అంటే బడ్జెట్‌లో మంచి ఆప్షన్ అని చాలా మంది ఇప్పటికే వాడుతున్నారు. గ్యాస్ ధరలు పెరిగిపోతున్న ఈ టైమ్‌లో.. ఇండక్షన్ కుక్‌టాప్ ఒక మంచి అల్టర్నేటివ్‌గా మారింది.

Advertisement

ధర గురించి చెప్పాలంటే..

ఐబెల్ కుక్‌టాప్‌ల పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ధర చాలా తక్కువగా ఉంటుంది. రూ.1300 నుంచిరూ. 1800 మధ్యలోనే మంచి 2000W కుక్‌టాప్ దొరుకుతుంది. ఇంత తక్కువ ధరలో ఇంత పవర్ రావడం అంటే నిజంగా బెస్ట్ అనొచ్చు. బడ్జెట్‌లో ఏదైనా మంచి వస్తువు కావాలంటే.. మాత్రం ఇది మంచి ఛాయిస్.

Advertisement

ఎలా పనిచేస్తుంది ?

2000W పవర్ ఉండటం వల్ల వేడి చాలా త్వరగా వస్తుంది. నీళ్లు మరిగించాలన్నా.. కూర వండాలన్నా టైమ్ చాలా తగ్గుతుంది. అంతే కాకుండా గ్యాస్ స్టౌవ్‌తో పోలిస్తే ఇది ఫాస్ట్‌గా పని చేస్తుంది. అలాగే కరెంట్ కూడా ఎక్కువగా వృథా కాకుండా ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే.. మీ ఇంట్లో వోల్టేజ్ స్టేబుల్‌గా లేకపోతే.. కొన్ని సార్లు ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది.

వాడటానికి ఈజీనా?
అవును.. దీనిని వాడటం చాలా ఈజీ. ఐబెల్ కుక్‌టాప్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఈజీగా ఉపయోగించవచ్చు.

బెస్ట్ ఫీచర్లు:

1. ఆటో షట్‌డౌన్

2. ఓవర్ హీట్ ప్రొటెక్షన్

3. ప్రీసెట్ మోడ్‌లు (రైస్, ఫ్రై, బాయిల్)

4. LED డిస్‌ప్లే

ఈ బటన్స్ అర్థం చేసుకోవడం కూడా చాలా సింపుల్. మొదటిసారి వాడేవాళ్లకూ ఇబ్బంది ఉండదు. ఇవే కాకుండా.. పైన గ్లాస్ సర్ఫేస్ ఉండటంతో క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. రోజుకు ఒకసారి తుడిచేస్తే సరిపోతుంది.

క్వాలిటీ:
ధరను బట్టి చూస్తే బిల్డ్ క్వాలిటీ చాలా బెటర్ అనిపిస్తుంది. గ్లాస్ టాప్ ఉంటుంది. దీని బాడీ మాత్రం ప్లాస్టిక్. రోజూ వాడుకోవడానికి సరిపోతుంది కానీ చాలా హై క్వాలిటీ అనిపించదు. జాగ్రత్తగా వాడితే ఎక్కువ రోజులు పని చేస్తుంది.

బెనిఫిట్స్:

ధర చాలా తక్కువ

2000W పవర్‌తో ఫాస్ట్ కుకింగ్

వాడటానికి సింపుల్

క్లీన్ చేయడం ఈజీ

సేఫ్టీ ఫీచర్స్ బాగుంటాయ్

Also Read: రూ.2000 లోపు బెస్ట్ ఇండక్షన్లు (2026) – టాప్ 5 మోడల్స్, ఫీచర్లు & ధర

కొంచెం మైనస్:

బిల్డ్ క్వాలిటీ సాధారణంగా ఉంటుంది.

వోల్టేజ్ సమస్యలుంటే.. ఇబ్బంది అవుతుంది

మొత్తం మీద.. మీకు తక్కువ ధరలో ఒక మంచి ఇండక్షన్ కుక్‌టాప్ కావాలంటే.. ఐబెల్ మంచి ఆప్షన్. స్టూడెంట్స్, చిన్న ఫ్యామిలీస్ లేదా సెకండ్ స్టౌవ్‌గా వాడుకునే వాళ్లకు ఇది బాగా సూట్ అవుతుంది. ప్రీమియం క్వాలిటీ కంటే “బడ్జెట్‌లో బెస్ట్” అనుకుంటే మాత్రం ఐబెల్ తీసుకోవచ్చు.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×