Tollywood Director : సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లకు హిట్ సినిమాలు పడితే వాళ్ల రేంజ్ పూర్తిగా మారిపోతుంది.. అది ఒక్క ఫ్లాప్ సినిమా కనక పడిందంటే మాత్రం ఆ తర్వాత వాళ్ళ జీవితం తల క్రిందలు అవుతుంది. ఒక్క ఫ్లాప్ సినిమా కనక అకౌంట్ లో పడితే ఆ తర్వాత స్టార్ హీరోలు కూడా ఆ డైరెక్టర్ ని పక్కన పెడుతుంటారు.. ఈమధ్య ఇదే ట్రెండు నడుస్తుంది.. దానివల్లే కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.. గతంలో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టామా అన్నది కాదు.. ఒక్క డిజాస్టర్ మూవీ పడితే ఆ లైట్ మొత్తం టర్న్ అయిపోతుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ డైరెక్టర్ పరిస్థితి ఇదే.. గతంలో చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. కానీ రీసెంట్ గా ఆయన చేసిన పాన్ ఇండియా హీరో సినిమా బెడిసి కొట్టింది. దాంతో ప్రస్తుతం భయంకరమైన గందరగోల పరిస్థితిలో డైరెక్టర్ ఉన్నాడు.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆయన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లలో ఒకరు మారుతి.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకొచ్చి ప్రూవ్ చేసుకున్నాడు.. చిన్న హీరోలతో ఆయన చేసిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ పెద్ద హీరోతో చేసిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. అయితే తనకు తానుగా ఏ స్టార్ ని ఛాన్స్ అడగలేదు. ఆ విధంగా మారుతి ఓ రోజు ప్రభాస్ కళ్లలో పడ్డాడు.` ప్రేమ కథా చిత్రమ్` లో ఎంటర్టైన్మెంట్ కు డార్లింగ్ ఫిదా అయిపోయాడు. అతనితో సినిమా చేయాలని డార్లింగ్ అనుకున్నాడు. అలా ఆ మూవీ కాస్త ఇప్పటికి కుదిరింది. వీరిద్దరి కాంబోలో రీసెంట్గా వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. మారుతి చేసిన ఈ ఒక్క మిస్టేకే అతని జీవితాన్ని ప్రస్తుతం గంధర గోళ పరిస్థితులలోకి నెట్టేసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read :మళ్ళీ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రామ్..స్టోరీ లైన్ వింటే మతిపోద్ది..
సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే స్టోరీలు ఏ రేంజ్ లో ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్న ప్రభాస్ అలాంటి రేంజ్ లో ఉన్న సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. అయితే మొదటిసారి ఒక చిన్న డైరెక్టర్ తో సినిమాకు ఒప్పుకున్నాడు. డైరెక్టర్ మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన రాజా సాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.. ష్యూర్ షాట్ గా రాజాసాబ్ తో తాను అనుకున్నది సాధిస్తాను అనుకున్నాడు. కానీ ఫలితం తేడాగా వచ్చే సరికి మారుతి తీవ్ర గందరగోళంలో పడ్డాడు.. ప్రస్తుతం అతను ఎటు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాడు. చిన్న హీరోకి దిగలేక.. పెద్ద హీరోతో ముందుకెళ్లలేక మధ్యలో పడిపోయాడు. జీవితంలో అనుకొని సంఘటనలు జరిగినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఎదురవుతాయి. మరి ఈ పరిస్థితుల నుంచి మారుతి ఎలా బయటపడతాడో చూడాలి.. ఇక రాజా సాబ్ 2 కూడా రాబోతున్నట్లు ప్రకటించారు.. మరి ఆ సినిమా ఇక ఉంటుందో లేదో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు..