E-Paper
Advertisement

JICA Loan Project: అటవీ శాఖ అభివృద్ధికి జైకా రుణ సహాయం

JICA Loan Project: అటవీ శాఖ అభివృద్ధికి జైకా రుణ సహాయం
Advertisement

JICA Loan Project: స్వేఛ్చ బ్యూరో: జైకా సహకారంతో 5 ఏళ్లకు రూ.1270 కోట్ల విలువైన ప్రాథమిక ప్రతిపాదనలు తెలంగాణ అటవీశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ మొత్తం వ్యయంలో 85 శాతం జైకా నుంచి రుణ రూపంలో నిధులను, మిగిలిన 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని ప్రతిపాదనలో పొందుపరిచారు. రాష్ట్ర అటవీశాఖను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుంచి రుణ సహాయం పొందేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. హైదరాబాద్ లోని అరణ్యభవన్‌లో అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి డాక్టర్ సీ.సువర్ణ అధ్యక్షతన జపాన్ నుంచి వచ్చిన జైకా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు.

అడవుల పునరుద్ధరణ

ఈ సమావేశంలో సువర్ణ తెలంగాణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. పచ్చదనం పెంపు లక్ష్యంగా వనమహోత్సవం కార్యక్రమాన్నిఅమలు చేస్తున్నామని, జైకా ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి, టైగర్ రిజర్వ్‌ల బలోపేతం, వన్యప్రాణి సంరక్షణ, అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్, విస్తృత ప్లాంటేషన్ కార్యక్రమాలు, క్షీణించిన అడవుల పునరుద్ధరణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ వంటి పలు కీలక కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు నిర్ణయించారు.

Advertisement

Also Read: BJP Rebel Candidates: కమలంలో కల్లోలం.. బీజేపీ మున్సిపల్ రెబల్స్ పై సస్పెన్షన్ వేటు..!

తెలంగాణతో కలిసి పని చేయడం

జైకా ప్రతినిధులు మాట్లాడుతూ భారత్–జపాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే దిశగా ప్రస్తుతం భారత్‌లోని పది రాష్ట్రాల్లో అటవీ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను జైకా అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ అటవీ శాఖ ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలు సమగ్రంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రశంసించారు. అటవీ సంరక్షణతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే దిశగా ఈ ప్రాజెక్టులు ఆదర్శంగా నిలుస్తాయని, తెలంగాణతో కలిసి పని చేయడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జైకా ప్రతినిధులు ఇహా చినాట్సు, షిమోజో హిటోమీ, జైకా భారతీయ ప్రతినిధి సిద్ధార్థ్ పరమేశ్వరన్, పీసీసీఎఫ్(వైల్డ్‌లైఫ్) వినయ్ కుమార్, పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహరి, సీసీఎఫ్ లు ప్రియాంక వర్గీస్, ఎస్.జె. ఆశ, క్షితిజ, డీఎఫ్ఓలు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Municipal Elections: కాంగ్రెస్‌కు కీలకంగా మారిన ఆ రెండు జిల్లాల కార్పొరేషన్లు.. వాటిపై స్పెషల్ ఫోకస్..?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×