E-Paper
Advertisement

Hyderabad Crime: సోషల్‌మీడియా చిచ్చు.. హుస్సేన్‌ సాగర్‌లోకి దూకి టెక్కీ ఆత్మహత్య, హైదరాబాద్‌లో దారుణం

Hyderabad Crime: సోషల్‌మీడియా చిచ్చు.. హుస్సేన్‌ సాగర్‌లోకి దూకి టెక్కీ ఆత్మహత్య, హైదరాబాద్‌లో దారుణం
Advertisement

Hyderabad Crime: పచ్చని కాపురంలో సోషల్‌మీడియా చిచ్చు పెడుతోంది. ఫలితంగా భార్యభర్తల మధ్య విభేదాలు, లేకుంటే ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెనుక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

హుస్సేన్ సాగర్‌లోకి దూకి టెక్కీ ఆత్మహత్య 

Advertisement

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఆత్మహత్యలకు కేరాఫ్‌గా మారుతోందా? ఎందుకు టెక్కీలు అందులో పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సాగర్ చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తాజాగా మరొక టెక్కీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. అసలేం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని మార్కాపురం ప్రాంతానికి చెందినవాడు 36 ఏళ్ల సీతారాం. నంద్యాలకు చెందిన యువతితో ఆయనకు వివాహం జరిగింది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావడంతో బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సాగుతున్న సంసారంలో సోషల్ మీడియా చిచ్చుపెట్టింది. గతంలో టెక్కీ భార్యకు ఇన్‌స్ట్రా ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.

Advertisement

హైదరాబాద్‌లో దారుణం.. సోషల్ మీడియా చిచ్చు

ఆ వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ కొద్దిరోజుల తర్వాత మళ్లీ వచ్చేసింది. ఆనాటి నుంచి భర్త సీతారం వద్ద ఉంటోంది. ఈ వ్యవహారంలో భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదుగానీ.. జనవరి నెల 24న భార్య మళ్లీ కోరుకున్న ప్రియుడితో వెళ్లిపోయింది. అప్పటివరకు అల్లుడి దగ్గర ఉండే అత్తమామలు, ఇద్దరు పిల్లలను తీసుకుని ఆదివారం నంద్యాలకు వెళ్లిపోయారు.

దీంతో భార్య వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు టెక్కీ సీతారాం. ఈ అవమానం తట్టుకోలేక ఆదివారం సాయంత్రం హుస్సేన్‌ సాగర్‌లోకి బైక్‌పై వచ్చాడు. చివరకు అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం హైడ్రా-లేక్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. సాయంత్రానికి సీతారాం మృతదేహం బయటపడింది. తన చావుకు భార్య-అత్తామామలతోపాటు మరొక వ్యక్తి కారణమని ఫోన్‌లో స్టేటస్‌ పెట్టుకున్నాడు.

ALSO READ: బడిలో భద్రత ఏది? మైనర్ బాలికను మాయమాటలతో లోబరుచుకున్న ఉపాధ్యాయుడు

అతడి వద్ద ప్లాస్టిక్‌ కవర్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ ద్వారా సీతారాంని గుర్తించారు. పోస్టుమాస్టం నిమిత్తం సీతారాం మృతదేహాన్ని గాందీ ఆసుపత్రికి తరలించారు. ఫోన్ ద్వారా లభించిన ఆధారాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వారం వ్యవధిలో ఇద్దరు టెక్కీలు సాగర్‌లోకి ఆత్మహత్య చేసుకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు బెంబేలెత్తుతున్నారు. వారం కింద ఓ మహిళా టెక్కీ సాగర్‌లోకి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి సంబంధాలు రిజెక్ట్ కావడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్న విషయం తెల్సిందే.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×