BigTV English

Tollywood Heros : టాలీవుడ్ స్టార్ హీరోల ఇళ్ల ఖరీదు ఎంతో తెలుసా..? ఆ హీరో ఇల్లు వెరీ కాస్ట్లీ..

Tollywood Heros : టాలీవుడ్ స్టార్ హీరోల ఇళ్ల ఖరీదు ఎంతో తెలుసా..? ఆ హీరో ఇల్లు వెరీ కాస్ట్లీ..

Tollywood Heros : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. అందరు హీరోలు సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే.. మరి కొంతమంది మాత్రం తమ టాలెంట్ తో అవకాశాలు అందుకొని కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు.. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరూ రిచ్ లైఫ్ ని అనుభవిస్తున్నారు.. తమ లైఫ్ స్టైల్ తో పాటుగా ఖరీదైన బంగ్లాలో ఉంటున్నారు.. అయితే చాలామంది అభిమానులు తమ హీరోల ఇంటిని చూడాలని.. ఆ ఇళ్లు ఎన్ని కోట్ల ఖరీదు ఉంటుందో తెలుసుకోవాలని ఆత్రుత కనబరుస్తుంటారు.. దీని గురించి పూర్తిగా గూగుల్ లో తెగ వెతికేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు మేము స్టార్ హీరోల ఇల్లు వాటి ఖరీదు గురించి వివరంగా చెప్పబోతున్నాం.. ఏ హీరోయిన్లు అత్యంత ఖరీదైనదో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఖరీదైన బంగ్లాలు, ఖరీదు.. 

మహేష్ బాబు.. 


టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. మహేష్ బాబు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన అభిరుచులకు అనుగుణంగా ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఇది ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, కస్టమ్-బిల్ట్ జిమ్ మరియు అన్ని ఫెసిలిటీస్ కలిగిన ప్రైవేట్ ఆఫీస్‌ను కలిగి ఉంది. దీని విలువ రూ. 30 కోట్లు ఉంటుందట..

ప్రభాస్.. 

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఏడాదికి అర డజను సినిమాలతో బిజీగా ఉంటాడు. ఇక ఈయనకు జూబ్లీహిల్స్‌లో విశాలమైన భవనం ఉంది. జిమ్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఈ ఇంట్లో ఉంటాయి. ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ. 60 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది..

రామ్ చరణ్…

ఆర్ఆర్ఆర్‌ తో గ్లోబర్ స్టార్ గా అవతరించిన ఈయనకు తన భార్య ఉపాసన ఓ ఇంటిని బహుబతిగా ఇచ్చింది. ఈ ఇల్లు జూబ్లీహిల్స్ లోనే ఉంది.. దాని విలువ 80 కోట్లకు పైగా ఉంటుంది..ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన ఆ ఇంట్లోనే ఉంటున్నారు. వీరిద్దరికీ తోడుగా వీరి ముద్దుల పాప క్లింకారా కూడా ఉంది.

అల్లు అర్జున్…

పుష్ప మూవీతో నేషనల్ వైడ్ గా స్టార్ హీరో అయ్యాడు. పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు. ఐకాన్ స్టార్ కూడా. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇక ఈయన ఇల్లు విషయానికొస్తే… జూబ్లీహిల్స్ లోనే ఉంటుంది. అన్ని సౌకర్యాలతో అత్యంత విలాంగా ఉండే ఈ ఇంటి ధర రూ. 100 కోట్లు పైగా ఉంటుందట.. ఇప్పుడు మరో ఇల్లును కూడా కడుతున్నారు..

ఎన్టీఆర్.. 

నందమూరి ఫ్యామిలీతో నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ స్వయంకృషితో స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్తో గ్లోబర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈయనకు హైదరాబాద్ లో రెండు ఇళ్లులు ఉన్నాయి. ఒకటి మెహదీపట్నంలో ఉండగా.. ఎన్టిఆర్ చిన్నతనం నుండి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటి ధర రూ. 30 కోట్ల వరకు ఉంటుందట. అలాగే జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ కు రూ. 40 కోట్లు విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది.. వీటితో పాటుగా పలు రెస్టారెంట్లు కూడా ఈయనకు ఉన్నాయి.

Also Read :  దూరమైన నర్మద, ప్రేమలు.. వేదవతికి దిమ్మతిరిగే షాక్.. భాగ్యం మాస్టర్ ప్లాన్?

ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా స్టార్లుగా వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపించడంతో అభిమానులు వీళ్ల లైఫ్ స్టైల్ ను తెలుసుకుంటున్నారు. ఇంకా చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలు కూడా రిచ్ హౌస్ లలోనే ఉంటున్నారు.. వాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా స్టార్ హీరోయిన్ల ఇల్లు కూడా ఉంటున్నాయి..

Related News

Hero Dharma Mahesh wife : మహేష్ ఎఫైర్స్ ను ఎవిడెన్స్ తో బయటపెట్టిన భార్య.. బిడ్డకోసమే ఫైట్..

Shilpa Shetty: హీరోయిన్ శిల్పాశెట్టి ఇంట విషాదం.. పోస్ట్ వైరల్!

Anushka Shetty: అనుష్క కోసం లాఠీ ఛార్జ్.. అది స్వీటీ రేంజ్

Ravi Teja – Ram: రవితేజ,రామ్ సినిమాలకు ముప్పు.. తెలిసి తెలిసి గోతిలో పడబోతున్నారా?

Sree Leela: వామ్మో శ్రీలీల మామూల్ది కాదుగా..వర్కౌట్ అవుతుందంటారా?

Big Stories

×